సరికొత్త ఆఫర్లతో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎప్పుడూ ఏదో ఒక సేల్ నిర్వహిస్తూనే ఉంటుంది. తాజాగా పిల్లల కోసం 'కిడ్స్ కార్నివల్' పేరుతో కొత్త సేల్ ప్రారంభించింది. మంగళవారమే (16వ తేదీ) ప్రారంభమైన ఈ ఆఫర్.. ఈ నెల 21 వరకు కొనసాగనుంది. ఈ ఆఫర్లో నోట్‌బుక్స్, బోర్డ్ గేమ్‌లు, స్కూల్ బ్యాగులు, పెన్నులు, పెన్సిళ్లు వంటివి సహా పిల్లలు వినియోగించే ఇతర అన్ని ఉత్పత్తులను భారీ తగ్గింపు ధరకు విక్రయిస్తోంది.
పిల్లలకు సంబంధించిన వస్తువులతో పాటు ఎకో స్మార్ట్ స్పీకర్, ఫైర్ టీవీ డివైజ్, కిండల్ ఈ-రీడర్ వంటి ఉపకరణాలపై 30 శాతం వరకు తగ్గింపు ఇస్తోంది.
కిడ్స్ కార్నివల్లో బెస్ట్ ఆఫర్లు..
- నాల్గో తరం ఎకో డాట్ స్మార్ట్ స్పీకర్ రూ.3,999కి విక్రయిస్తోంది అమెజాన్
- అలెక్సా వాయిస్ రిమోట్‌తో కూడిన ఫైర్ టీవీ స్టిక్ లైట్ ధరను రూ.2,999గా నిర్ణయించింది.
- టెన్త్ జెనరేషన్ కిండల్ ఈ-రీడర్ ధర రూ.7,999గా ఉంచింది అమెజాన్.
ఇదీ చదవండి:వారసత్వంపై 84% మంది సంపన్నుల పునఃసమీక్ష!