ETV Bharat / business

సూపర్​కార్ల వెబ్​సైట్​లో అండర్​వేర్​ సేల్​- సర్వర్​ క్రాష్​ - elon musk shorts

ఎలాన్​ మస్క్​.. ప్రపంచ దిగ్గజ ప్రారిశ్రామికవేత్తల్లో ఒకరు. సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉండే ఆయన ఇదే వేదిక నుంచి తన ఉత్పత్తులకు వినూత్నంగా ప్రచారాన్ని చేసుకొంటారు. తాజాగా లాంచ్​ అయిన ఓ వస్తువు గురించి ట్వీట్​ చేయగా.. కొనుగోళ్లదారులు క్యూ కట్టేశారు. దెబ్బకు సైట్​ క్రాష్​ అయిపోయింది. ఇంతకీ ఏంటా ఉత్పత్తి? ఎందుకంత క్రేజ్?

Tesla Now Has Its Own Short Shorts That Broke the Official Tesla Online Shop
సూపర్​కార్ల వెబ్​సైట్​లో అండర్​వేర్​ సేల్​- సర్వర్​ క్రాష్​
author img

By

Published : Jul 12, 2020, 5:05 PM IST

కొందరు ఏం చేసినా నలుగురిలో మనం కాదు మనకంటూ ఓ స్పెషాలిటీ, మార్క్​ ఉండాలనుకుంటారు. ఆ జాబితాలో టాప్​లో ఉంటారు ఎలాన్​ మస్క్​. ఎలక్ట్రిక్​ వాహనాలు తయారు చేసే ప్రముఖ సంస్థ టెస్లాకు అధిపతి. తనకు బిడ్డ పుడితే విభిన్నమైన పేరు పెట్టి నెటిజన్లు రోజుల తరబడి చర్చించుకునేలా చేశారు మస్క్​. అలాంటి వ్యక్తి ఇటీవల ఓ ట్వీట్​ చేేేస్తే అండర్​ వేర్​లు కాస్తా హాట్​కేకుల్లా అమ్ముడైపోయాయి.

టెస్లా సంస్థ తాజాగా సరికొత్త డిజైన్​తో లోదుస్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. టెస్లా 'షార్ట్​ షార్ట్స్​' పేరుతో ఆన్​లైన్​లో సేల్​కు ఉంచింది. అయితే విపరీతమైన క్రేజ్​ ఉన్న మస్క్​ దాని గురించి ట్వీట్​ చేయగా.. జనం పోటెత్తి మరీ కొన్నారు. దెబ్బకు వెబ్​సైట్​ క్రాష్​ అయిపోయింది. కొన్ని గంటల తర్వాత ఎట్టకేలకు దాన్ని పునరుద్ధరించారు.

షార్ట్స్ వెనుక పెద్ద కథ!

ఎవరినైనా విమర్శించడంలోనూ వెనుకాడని ఎలాన్​ ఆ షార్ట్స్​తోనూ కొందరి గురించి ప్రపంచానికి పరిచయం చేశారు. వాళ్లే టెస్లా షార్టర్స్. స్టాక్​ మార్కెట్​కు చెందిన కొందరు టెస్లా స్టాక్​ను అమ్మి, కృత్రిమంగా విలువ తగ్గేలా చేసేవారు. తగ్గిన ధర వద్ద కొని, మళ్లీ ధర పెరిగాక అమ్మేవారు. మార్కెట్​ లొసుగులు తెలిసిన వాళ్లే ఇలా షేర్లతో ఆటలాడుకుంటున్నారని.. మస్క్​ ఎన్నోసార్లు విమర్శలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. అయితే షార్ట్స్​తో షార్టర్స్​ను అందరూ గుర్తుంచుకునేలా పేరు పెట్టారు. అంతేకాకుండా ధర గురించి ఓ లాజిక్​ చెప్పారు. షార్ట్ ఒక్కటి రూ. 5180(69.420 డాలర్లు). ఇందులో 420 అనేది... టెస్లా షేర్ విలువ​ 420 డాలర్లకు చేర్చాలన్న ఆలోచనకు ప్రతిరూపం.

ప్రతి విషయంలోనూ క్రేజీగా ఆలోచిస్తారు​ కాబట్టే క్రేజీ బిజినెస్​మ్యాన్​గానూ పేరు తెచ్చుకున్నారు ఎలాన్​ మస్క్​.​

ఇదీ చూడండి:మస్క్ ట్వీట్​ తెచ్చిన తంటా- టెస్లా షేర్లు 10% డౌన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.