భారత సాఫ్ట్‌వేర్ రంగ పితామహుడు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్-టీసీఎస్ వ్యవస్థాపకులు, మొదటి సీఈవో ఫకీర్ చంద్ కోహ్లీ కన్నుమూశారు. 96 ఏళ్ల ఎఫ్.సి. కోహ్లీ.. వయో సంబంధిత సమస్యలతో మరణించినట్లు టీసీఎస్ ప్రకటించింది. భారత సాఫ్ట్‌వేర్ రంగానికి.. ఆయన చేసిన సేవలకుగానూ 2002లో నాటి ప్రభుత్వం కోహ్లీని పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.
భారత సాంకేతిక విప్లవంలో కోహ్లీ కీలక పాత్ర వహించారు. 1924 మార్చి 19న.. పెషావర్‌లో జన్మించిన ఆయన.. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. 1951లో టాటా ఎలక్ట్రిక్ కంపెనీలో చేరి.. 1970 వరకు డైరెక్టర్‌గా ఎదిగారు. తన హయాంలో డిజిటల్ కంప్యూటర్ల వాడకాన్ని ప్రోత్సహించారు. 1969లో టీసీఎస్ జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించిన కోహ్లీ.. 1994లో డిప్యూటీ ఛైర్మన్‌గా ఎదిగి సంస్థను ఉన్నత శిఖరాలకు చేర్చారు. 1991లో అంతర్జాతీయ సంస్థ ఐబీఎమ్‌ను.. భారత్‌కు తీసుకురావడానికి కోహ్లీ ఎంతో కృషి చేశారు. ఆయన మృతిపై టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
ఇదీ చూడండి:- ఒక షిఫ్టు 12 గంటలు- ఎందుకంత వ్యతిరేకత?