ETV Bharat / business

'ఈ ఏడాదీ ఇంటి నుంచే పని'

వ్యాక్సిన్​ వచ్చినా.. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఐటీ నిపుణుల్లో ఎక్కువ మంది ఈ ఏడాది కూడా ఇంటి నుంచే పనిచేయాల్సి వస్తుందని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వి.రాజన్న స్పష్టం చేశారు. ఇంటి నుంచి పని వల్ల ఉత్పాదకత ఏమీ తగ్గలేదని ఆయన తెలిపారు.

TCS employees will be in Work from home for this year .. TCS revealed
ఈ ఏడాదీ ఇంటి నుంచే పని.. వెల్లడించిన టీసీఎస్​
author img

By

Published : Mar 22, 2021, 7:44 AM IST

కరోనా కాలం జనజీవనశైలిలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ప్రజల డిజిటల్‌ అలవాట్లను మరింత వేగవంతం చేసింది. షాపింగ్‌ మొదలు... రోజువారీ ఉద్యోగం వరకూ అన్నీ ఇంటి నుంచే చేసే సంస్కృతి ఊపందుకుంది. అన్ని రంగాల్లో పరోక్ష సేవలు వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఐటీ కంపెనీలకు ఆర్డర్లూ పెరుగుతున్నాయి. తదనుగుణంగా ఆ రంగం మార్పులు చేసుకుంటోంది. అత్యధిక ఉద్యోగులు 'వర్క్‌ ఫ్రం హోం'లో ఉండడం ఆ రంగంలోని ప్రధాన పరిణామం. వైరస్‌ భయాలు ఇంకా తొలగని నేపథ్యంలో, ఐటీ నిపుణుల్లో ఎక్కువమంది 2021లోనూ ఇంటి నుంచే పనిచేయాల్సి వస్తుందని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వి.రాజన్న స్పష్టం చేశారు. ఇంటి నుంచి పని వల్ల ఉత్పాదకత ఏమీ తగ్గలేదని ఆయన తెలిపారు. కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో, పలు అంశాలను 'ఈనాడు' ముఖాముఖిలో వివరించారు.

TCS employees will be in Work from home for this year .. TCS revealed
సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వి.రాజన్న
కొవిడ్‌ నేపథ్యంలో ఇంటి నుంచి పని మొదలై ఏడాది గడిచింది. ఆఫీసులకు వచ్చి పనిచేస్తామంటూ ఉద్యోగులు చెబుతున్నారని సర్వేలు పేర్కొంటున్నాయి. మీ ప్రణాళిక ఏమిటి?
కొవిడ్‌ మహమ్మారి ప్రారంభంలోనే ఇంటి నుంచి పనికి అనుమతించాం. అది ఎటువంటి ఆటంకాలు లేకుండా అమలవుతోంది. హైదరాబాద్‌ కేంద్రంలో 54,000 మంది ఉద్యోగులున్నారు. ప్రాంగణ నియామకాల్లో ఎంపికై, ఉద్యోగ నియామకం-చేరిక కూడా ఆన్‌లైన్‌లో పూర్తిచేసుకున్న వారితో సహా 50,000 మందికి కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఇంటికే పంపాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోని స్వస్థలాలకు చేరిన వారికీ అవి అందాయి. ఆర్థికసేవలు, బ్యాంకింగ్‌ వంటి గోప్యత ఎక్కువ ఉండే రంగాల్లోని కీలకమైన 500 మంది మాత్రమే ఆఫీసులకు వస్తున్నారు. ఇతరులు కూడా రావాలనుకుంటే, అభ్యంతరం ఏమీ లేదు. కార్యాలయాలు తెరిచే ఉన్నాయి. కొవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

ఐటీలో ఉద్యోగ కోతలు ఏమైనా ఉన్నాయా?
కొవిడ్‌ వల్ల అన్ని రంగాల్లో డిజిటలీకరణ పెరిగింది. ఐటీ కంపెనీలకు ఆర్డర్లు ఎక్కువయ్యాయి. అందువల్ల నిపుణులైన సిబ్బందికి ప్రోత్సాహకాలు, వేతన పెంపును అమలు చేస్తున్నాం. కోతలు ఏమీ లేవు. కొత్త నైపుణ్యాలు అలవరచుకోని వారికి మాత్రం ఎప్పుడైనా కష్టమే.
ఇంటి వద్ద పని వల్ల అధిక భారం పడుతోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇది నిజమేనా?
ఎన్ని గంటలు పనిచేశారన్నది కాదు.. ఎంత ఉత్పాదకత సాధించారన్నదే ప్రామాణికం. ఆఫీసులో అయినా, ఇంటి దగ్గరున్నా అంతే. 9 ఉత్పాదక గంటలు పనిచేయాల్సిందే. అంతకు మించి భారం మోపడం లేదు. సాధారణంగా ఇంట్లో ఉన్నప్పుడు మధ్యలో విరామం తీసుకుంటుంటే, ఎక్కువ గంటలు పని చేస్తున్నట్లు అనిపిస్తుంది.
ఇంటి నుంచి పని ఎప్పటివరకు కొనసాగొచ్చు?
గతంలో ప్రకటించిన ప్రకారం జూన్‌ వరకు అయితే తప్పనిసరిగా కొనసాగుతుంది. ఇప్పుడు కొవిడ్‌ రెండో విడత కేసులు పెరుగుతున్నాయి. అన్ని వయసుల వారికి టీకా వచ్చేవరకు, కార్యాలయాలకు రావాలనడం ఇబ్బందికరమే అవుతుంది. ముఖ్యంగా ఉద్యోగుల ఆరోగ్యభద్రతకు ప్రాధాన్యమిస్తున్నందునే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అందువల్ల 2021లోనూ దాదాపు ఎక్కువ మంది ఇళ్ల నుంచే పనిచేయొచ్చు. అత్యధికులు కుటుంబాలతో తమ స్వస్థలాలకు వెళ్లి, అక్కడి నుంచే పనిచేస్తున్నారు. వారిలో కంపెనీపై నిబద్ధత తగ్గకుండా ఎప్పటికప్పుడు సంభాషిస్తున్నాం. కొత్తగా నియమితులైన వారికి శిక్షణ, యోగా, ఆరోగ్య సంరక్షణ సూచనల వంటివి ఆన్‌లైన్‌లో నేర్పుతున్నాం. ముఖాముఖి కలవడం మినహా ఏ రకంగానూ ఉద్యోగులతో అనుబంధం ఆపలేదు. హైదరాబాద్‌ సహా దేశంలోని 11 నగరాల్లో టీసీఎస్‌ ఉద్యోగుల కోసం ప్రత్యేక ఐసొలేషన్‌ కేంద్రాలు నిర్వహిస్తున్నాం.
దృశ్యమాధ్యమ విధానంలో ఖాతాదారులతో సంబంధాలు ఎలా ఉన్నాయి?
సాధారణంగా ఖాతాదారులతో సమావేశాలు లంచ్‌, డిన్నర్‌ వేదికగా జరుగుతుంటాయి. ఇప్పుడు డిజిటల్‌ డిన్నర్లకు పరిమితమవుతున్నాం. అదెలాగంటే ఇక్కడ మేము, వేరే ప్రదేశంలో ఖాతాదారు భోజనం చేస్తూనే దృశ్యమాధ్యమ విధానంలో మాట్లాడుకుంటున్నాం. వీటినే డిజిటల్‌ డిన్నర్లుగా వ్యవహరిస్తున్నాం. విదేశీ ఖాతాదారులతో సమావేశాలు ఇలాగే జరుగుతున్నాయి. దేశీయ ఖాతాదారులతో మాత్రం ముఖ్యమైన సమావేశాలుంటేనే ప్రత్యక్షంగా హాజరవుతున్నాం.

ఇతర ఐటీ కంపెనీల్లో ఇలా...

కొవిడ్‌ రెండో విడత కేసులను గమనిస్తున్న ఐటీ సంస్థలు, ఉద్యోగులకు టీకా వేయించడంపై దృష్టి సారించాయి. ఉద్యోగుల పిల్లలకు సంబంధించి విద్యాసంస్థలు ఎలా పనిచేస్తాయో జూన్‌లో తెలుస్తుంది కనుక, అప్పటి వరకు ఇంటి నుంచి పని కొనసాగించేందుకే మొగ్గుచూపుతున్నాయి. తదుపరి కార్యాచరణను జూన్‌లో ప్రకటించాలని చూస్తున్నాయి.

  1. ఇన్ఫోసిస్‌: కొవిడ్‌ ముందు కూడా, ప్రాజెక్టు నిబంధనల మేరకు నెలలో 9 రోజులు ఇంటి నుంచి పని చేసే అవకాశమిచ్చారు. గత మార్చి నుంచి పూర్తిగా అనుమతిస్తున్నారు. ఇటీవలి వరకు మేనేజర్‌ స్థాయి అధికారి సమ్మతితో ఆఫీసుకు వచ్చి పనిచేసుకోవచ్చని తెలిపారు. ఇప్పుడు దరఖాస్తు చేసుకుని, సెక్యూరిటీకి చూపి ఏ ఉద్యోగి అయినా కార్యాలయానికి వచ్చి విధులు నిర్వహించుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఎవరినీ కార్యాలయానికి రమ్మని మాత్రం సంస్థ తరఫున ఆదేశించడం లేదు.
  2. మైక్రోసాఫ్ట్‌ ఇండియా: జూన్‌ ఆఖరు వరకు ఇంటి నుంచి పనికి అనుమతించింది. ఇటీవల 25 శాతం మంది కార్యాలయాలకు రావచ్చని ప్రకటించినా, ఒక శాతం మంది కూడా ముందుకు రాలేదని సమాచారం.
  3. అసెంచర్‌: పూర్తిగా ఇంటి నుంచే పనిచేస్తారా, పాక్షికంగా కార్యాలయానికి వస్తారా, పూర్తిగా కార్యాలయానికి వచ్చి పనిచేస్తారా అంటూ ఉద్యోగుల అభిప్రాయాలు సేకరించింది. జూన్‌లో తదుపరి ప్రణాళిక ప్రకటిస్తుందని భావిస్తున్నారు.
  4. అడోబ్‌: పూర్తిగా ఇంటి నుంచి పనికే ఆదేశాలిచ్చింది.
  5. టెక్‌ మహీంద్రా: ఇప్పుడు 20 శాతం మంది కార్యాలయాలకు రావచ్చని ప్రకటించింది. కేసుల తీవ్రత ఆధారంగా తదుపరి కార్యాచరణను నిర్ణయించనుంది.
  6. ఫ్యాక్ట్‌సెట్‌: ప్రతి మూడు నెలలకోసారి సమీక్షించి, ఇంటి నుంచి పనిని పొడిగిస్తోంది. జూన్‌ ఆఖరుకు తదుపరి ప్రణాళికను వెల్లడించనుంది.

ఇదీ చూడండి: టీసీఎస్​కు లాభాల పంట- 9 ఏళ్ల రికార్డ్ బ్రేక్

కరోనా కాలం జనజీవనశైలిలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ప్రజల డిజిటల్‌ అలవాట్లను మరింత వేగవంతం చేసింది. షాపింగ్‌ మొదలు... రోజువారీ ఉద్యోగం వరకూ అన్నీ ఇంటి నుంచే చేసే సంస్కృతి ఊపందుకుంది. అన్ని రంగాల్లో పరోక్ష సేవలు వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఐటీ కంపెనీలకు ఆర్డర్లూ పెరుగుతున్నాయి. తదనుగుణంగా ఆ రంగం మార్పులు చేసుకుంటోంది. అత్యధిక ఉద్యోగులు 'వర్క్‌ ఫ్రం హోం'లో ఉండడం ఆ రంగంలోని ప్రధాన పరిణామం. వైరస్‌ భయాలు ఇంకా తొలగని నేపథ్యంలో, ఐటీ నిపుణుల్లో ఎక్కువమంది 2021లోనూ ఇంటి నుంచే పనిచేయాల్సి వస్తుందని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వి.రాజన్న స్పష్టం చేశారు. ఇంటి నుంచి పని వల్ల ఉత్పాదకత ఏమీ తగ్గలేదని ఆయన తెలిపారు. కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో, పలు అంశాలను 'ఈనాడు' ముఖాముఖిలో వివరించారు.

TCS employees will be in Work from home for this year .. TCS revealed
సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వి.రాజన్న
కొవిడ్‌ నేపథ్యంలో ఇంటి నుంచి పని మొదలై ఏడాది గడిచింది. ఆఫీసులకు వచ్చి పనిచేస్తామంటూ ఉద్యోగులు చెబుతున్నారని సర్వేలు పేర్కొంటున్నాయి. మీ ప్రణాళిక ఏమిటి?కొవిడ్‌ మహమ్మారి ప్రారంభంలోనే ఇంటి నుంచి పనికి అనుమతించాం. అది ఎటువంటి ఆటంకాలు లేకుండా అమలవుతోంది. హైదరాబాద్‌ కేంద్రంలో 54,000 మంది ఉద్యోగులున్నారు. ప్రాంగణ నియామకాల్లో ఎంపికై, ఉద్యోగ నియామకం-చేరిక కూడా ఆన్‌లైన్‌లో పూర్తిచేసుకున్న వారితో సహా 50,000 మందికి కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఇంటికే పంపాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోని స్వస్థలాలకు చేరిన వారికీ అవి అందాయి. ఆర్థికసేవలు, బ్యాంకింగ్‌ వంటి గోప్యత ఎక్కువ ఉండే రంగాల్లోని కీలకమైన 500 మంది మాత్రమే ఆఫీసులకు వస్తున్నారు. ఇతరులు కూడా రావాలనుకుంటే, అభ్యంతరం ఏమీ లేదు. కార్యాలయాలు తెరిచే ఉన్నాయి. కొవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

ఐటీలో ఉద్యోగ కోతలు ఏమైనా ఉన్నాయా?
కొవిడ్‌ వల్ల అన్ని రంగాల్లో డిజిటలీకరణ పెరిగింది. ఐటీ కంపెనీలకు ఆర్డర్లు ఎక్కువయ్యాయి. అందువల్ల నిపుణులైన సిబ్బందికి ప్రోత్సాహకాలు, వేతన పెంపును అమలు చేస్తున్నాం. కోతలు ఏమీ లేవు. కొత్త నైపుణ్యాలు అలవరచుకోని వారికి మాత్రం ఎప్పుడైనా కష్టమే.
ఇంటి వద్ద పని వల్ల అధిక భారం పడుతోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇది నిజమేనా?
ఎన్ని గంటలు పనిచేశారన్నది కాదు.. ఎంత ఉత్పాదకత సాధించారన్నదే ప్రామాణికం. ఆఫీసులో అయినా, ఇంటి దగ్గరున్నా అంతే. 9 ఉత్పాదక గంటలు పనిచేయాల్సిందే. అంతకు మించి భారం మోపడం లేదు. సాధారణంగా ఇంట్లో ఉన్నప్పుడు మధ్యలో విరామం తీసుకుంటుంటే, ఎక్కువ గంటలు పని చేస్తున్నట్లు అనిపిస్తుంది.
ఇంటి నుంచి పని ఎప్పటివరకు కొనసాగొచ్చు?
గతంలో ప్రకటించిన ప్రకారం జూన్‌ వరకు అయితే తప్పనిసరిగా కొనసాగుతుంది. ఇప్పుడు కొవిడ్‌ రెండో విడత కేసులు పెరుగుతున్నాయి. అన్ని వయసుల వారికి టీకా వచ్చేవరకు, కార్యాలయాలకు రావాలనడం ఇబ్బందికరమే అవుతుంది. ముఖ్యంగా ఉద్యోగుల ఆరోగ్యభద్రతకు ప్రాధాన్యమిస్తున్నందునే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అందువల్ల 2021లోనూ దాదాపు ఎక్కువ మంది ఇళ్ల నుంచే పనిచేయొచ్చు. అత్యధికులు కుటుంబాలతో తమ స్వస్థలాలకు వెళ్లి, అక్కడి నుంచే పనిచేస్తున్నారు. వారిలో కంపెనీపై నిబద్ధత తగ్గకుండా ఎప్పటికప్పుడు సంభాషిస్తున్నాం. కొత్తగా నియమితులైన వారికి శిక్షణ, యోగా, ఆరోగ్య సంరక్షణ సూచనల వంటివి ఆన్‌లైన్‌లో నేర్పుతున్నాం. ముఖాముఖి కలవడం మినహా ఏ రకంగానూ ఉద్యోగులతో అనుబంధం ఆపలేదు. హైదరాబాద్‌ సహా దేశంలోని 11 నగరాల్లో టీసీఎస్‌ ఉద్యోగుల కోసం ప్రత్యేక ఐసొలేషన్‌ కేంద్రాలు నిర్వహిస్తున్నాం.
దృశ్యమాధ్యమ విధానంలో ఖాతాదారులతో సంబంధాలు ఎలా ఉన్నాయి?
సాధారణంగా ఖాతాదారులతో సమావేశాలు లంచ్‌, డిన్నర్‌ వేదికగా జరుగుతుంటాయి. ఇప్పుడు డిజిటల్‌ డిన్నర్లకు పరిమితమవుతున్నాం. అదెలాగంటే ఇక్కడ మేము, వేరే ప్రదేశంలో ఖాతాదారు భోజనం చేస్తూనే దృశ్యమాధ్యమ విధానంలో మాట్లాడుకుంటున్నాం. వీటినే డిజిటల్‌ డిన్నర్లుగా వ్యవహరిస్తున్నాం. విదేశీ ఖాతాదారులతో సమావేశాలు ఇలాగే జరుగుతున్నాయి. దేశీయ ఖాతాదారులతో మాత్రం ముఖ్యమైన సమావేశాలుంటేనే ప్రత్యక్షంగా హాజరవుతున్నాం.

ఇతర ఐటీ కంపెనీల్లో ఇలా...

కొవిడ్‌ రెండో విడత కేసులను గమనిస్తున్న ఐటీ సంస్థలు, ఉద్యోగులకు టీకా వేయించడంపై దృష్టి సారించాయి. ఉద్యోగుల పిల్లలకు సంబంధించి విద్యాసంస్థలు ఎలా పనిచేస్తాయో జూన్‌లో తెలుస్తుంది కనుక, అప్పటి వరకు ఇంటి నుంచి పని కొనసాగించేందుకే మొగ్గుచూపుతున్నాయి. తదుపరి కార్యాచరణను జూన్‌లో ప్రకటించాలని చూస్తున్నాయి.

  1. ఇన్ఫోసిస్‌: కొవిడ్‌ ముందు కూడా, ప్రాజెక్టు నిబంధనల మేరకు నెలలో 9 రోజులు ఇంటి నుంచి పని చేసే అవకాశమిచ్చారు. గత మార్చి నుంచి పూర్తిగా అనుమతిస్తున్నారు. ఇటీవలి వరకు మేనేజర్‌ స్థాయి అధికారి సమ్మతితో ఆఫీసుకు వచ్చి పనిచేసుకోవచ్చని తెలిపారు. ఇప్పుడు దరఖాస్తు చేసుకుని, సెక్యూరిటీకి చూపి ఏ ఉద్యోగి అయినా కార్యాలయానికి వచ్చి విధులు నిర్వహించుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఎవరినీ కార్యాలయానికి రమ్మని మాత్రం సంస్థ తరఫున ఆదేశించడం లేదు.
  2. మైక్రోసాఫ్ట్‌ ఇండియా: జూన్‌ ఆఖరు వరకు ఇంటి నుంచి పనికి అనుమతించింది. ఇటీవల 25 శాతం మంది కార్యాలయాలకు రావచ్చని ప్రకటించినా, ఒక శాతం మంది కూడా ముందుకు రాలేదని సమాచారం.
  3. అసెంచర్‌: పూర్తిగా ఇంటి నుంచే పనిచేస్తారా, పాక్షికంగా కార్యాలయానికి వస్తారా, పూర్తిగా కార్యాలయానికి వచ్చి పనిచేస్తారా అంటూ ఉద్యోగుల అభిప్రాయాలు సేకరించింది. జూన్‌లో తదుపరి ప్రణాళిక ప్రకటిస్తుందని భావిస్తున్నారు.
  4. అడోబ్‌: పూర్తిగా ఇంటి నుంచి పనికే ఆదేశాలిచ్చింది.
  5. టెక్‌ మహీంద్రా: ఇప్పుడు 20 శాతం మంది కార్యాలయాలకు రావచ్చని ప్రకటించింది. కేసుల తీవ్రత ఆధారంగా తదుపరి కార్యాచరణను నిర్ణయించనుంది.
  6. ఫ్యాక్ట్‌సెట్‌: ప్రతి మూడు నెలలకోసారి సమీక్షించి, ఇంటి నుంచి పనిని పొడిగిస్తోంది. జూన్‌ ఆఖరుకు తదుపరి ప్రణాళికను వెల్లడించనుంది.

ఇదీ చూడండి: టీసీఎస్​కు లాభాల పంట- 9 ఏళ్ల రికార్డ్ బ్రేక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.