ETV Bharat / business

టాటా కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఏయే మోడళ్లపై  ఎంతంటే..?

author img

By

Published : Mar 5, 2022, 5:16 PM IST

Updated : Mar 5, 2022, 5:27 PM IST

tata cars holi offers : టాటా కార్లపై భారీ డిస్కౌంట్​ ఆఫర్లు కొనసాగుతున్నాయి. హోలీ పండగ సందర్భంగా సంస్థ వీటిని ప్రకటించింది. టాటా టియాగో, టిగోర్​, హ్యారియర్​ కార్లపై డిస్కౌంట్లు కొనసాగుతున్నాయి.

Tata Motors offering massive
టాటా కార్లపై భారీ డిస్కౌంట్లు

tata cars holi offers : హోలీ పండగ సందర్భంగా టాటా మోటార్స్​ కార్లపై భారీ డిస్కౌంట్​లను ప్రకటించింది. తమ ఉత్పత్తులు అయిన టియాగో, టిగోర్​, హ్యారియర్​ లాంటి కార్లపై డిస్కౌంట్లను అందిస్తున్నట్లు తెలిపింది. మార్చి నెలలో ఈ కార్లను కొనుగోలు చేసిన వారికే ఈ హోలీ ఆఫర్​ వర్తించనుంది.

మార్చిలో ఏఏ కార్లపై ఎంత డిస్కౌంట్..?

ఎంవై 2021 మోడల్​లో వచ్చిన టాటా హ్యాచ్‌బ్యాక్ టియాగోపై రూ. 10,000 క్యాష్​ బ్యాక్​ను అందిస్తుంది. ఎంవై 2022 కార్ల కింద సుమారు రూ. 15 వేల వరకు క్యాష్​ బ్యాక్ కూడా ఇవ్వనుంది సంస్థ. దీనితో పాటు మరో రూ. 3,000 వరకు కార్పొరేట్ తగ్గింపును కూడా వినియోగదారులు పొందవచ్చు. అయితే ఈ ఆఫర్​లు కేవలం పెట్రోల్ వేరియంట్‌లకు మాత్రమే వర్తిస్తాయిని సంస్థ తెలిపింది.

tata tiago
టాటా టియాగో

టాటా టిగోర్​ మీద కూడా ఇలాంటి డిస్కౌంట్​లు ప్రకటించింది సంస్థ. సుమారు రూ. 10 వేల వరకు క్యాష్​ బ్యాక్​ను అందిస్తుంది. ఎక్స్ఛేంజ్​ ఆఫర్​లో మరో రూ. 15 వేల క్యాష్​ బ్యాక్​ ఇవ్వనుంది. కార్పొరేట్​ డిస్కౌంట్​ కింద మరో రూ. 3వేల వరకు అందస్తుంది. టిగోర్​లో కేవలం పెట్రోల్​ వేరియంట్లకే ఈ ఆఫర్లు వర్తించనున్నాయి.

tata tigor
టాటా టిగోర్​

టాటా నెక్సాన్​ లోని ఐసీఈ డీజిల్ వేరియంట్ల​లో రూ. 15 వేల ఎక్స్ఛేంజ్​ బోనస్​ ఇవ్వనుంది. పెట్రోల్​ వేరియంట్లపై కూడా ఇదే ఆఫర్​ అందించనుంది. పెట్రోల్ వేరియంట్​లో రూ. 3 వేల వరకు కార్పొరేట్​ డిస్కౌంట్​ను అందిస్తుంది. డీజిల్​ వేరియంట్లపై ఈ డిస్కౌంట్​ రూ. 5 వేల వరకు ఉంది.

ఇదిలా ఉంటే టాటా హ్యారియర్​ కార్లపై రూ. 20 వేల వరకు క్యాష్​ డిస్కౌంట్​ ప్రకటించింది సంస్థ. ఎక్స్ఛేంజ్​ ఇన్​సెంటివ్​​ కింద రూ. 40 వేలు ఇస్తుంది. దీనిలో కూడా కార్పొరేట్​ డిస్కౌంట్​ రూ. 5 వేల వరకు ఉంది.

ఇదీ చూడండి:

విద్యుత్ వాహనాల కోసం సోనీ, హోండా జట్టు.. తొలి కారు అప్పుడే!

Last Updated : Mar 5, 2022, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.