ETV Bharat / business

మార్కెట్లోకి హారియర్ ఎక్స్​టీ ప్లస్- ధరెంతంటే...

author img

By

Published : Sep 4, 2020, 6:14 PM IST

దేశీయ మార్కెట్​లోకి టాటా మోటార్స్ మరో కొత్త ఎస్​యూవీని విడుదల చేసింది. హారియర్ ఎక్స్​టీ ప్లస్ పేరుతో తీసుకొచ్చిన ఈ మోడల్ ధర, ఫీచర్లు ఇలా ఉన్నాయి.

Harrier xt plus price
హారియల్ ఎక్స్​టీ ధర

దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఎస్​యూవీ విభాగంలో మరో కొత్త మోడల్​ను ఆవిష్కరించింది. హారియర్​ ఎక్స్​టీ ప్లస్​ పేరుతో ఈ వేరియంట్​ను మార్కెట్లోకి విడుదల చేసినట్లు టాటా మోటార్స్ శుక్రవారం ప్రకటించింది.

ఈ మోడల్ ప్రారంభ ధర రూ.16.99 లక్షలు (దిల్లీ ఎక్స్​ షోరూం)గా నిర్ణయించింది టాటా మోటార్స్. ఎక్స్​టీ ప్లస్ వేరియంట్​లో​ పనోరమిక్ సన్​రూఫ్​ సహా మరిన్ని కొత్త ఫీచర్లు పొందుపరిచినట్లు వెల్లడించింది.

ప్రస్తుతం ప్రకటించిన ప్రారంభ ధర సెప్టెంబర్​లోపు కారు​ బుక్ చేసుకున్న వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని టాటా మోటార్స్ తెలిపింది. వారికి డిసెంబర్​ 31 లోపు కారు​ డెలివరీ చేయనున్నట్లు వెల్లడించింది. అక్టోబర్​ 1 నుంచి ఈ మోడల్ ధరలు పెంచనున్నట్లు వివరించింది.

ఫీచర్లు..

ఎక్స్​టీ ప్లస్ వేరియంట్.. 2 లీటర్ల డీజిల్ ఇంజిన్​తో లభించనుంది. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్​మిషన్, ప్రొజెక్టర్ హెడ్​ల్యాంప్స్​, 17 అంగుళాల అలాయ్​ వీల్స్ పొందుపరిచారు.

ఇదీ చూడండి:ప్లే స్టోర్​, యాప్ స్టోర్​ నుంచి పబ్​జీ తొలగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.