భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా టీ రబి శంకర్‌ను నియమించాలన్న నిర్ణయాన్ని కేబినెట్ అపాయింట్స్‌మెంట్ కమిటీ ఆమోదించింది. ప్రస్తుతం ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న శంకర్‌ను డిప్యూటీ గవర్నర్‌గా నియమిస్తూ కేంద్రం ప్రకటన జారీ చేసింది. డిప్యూటీ గవర్నర్ హోదాలో టీ రబి శంకర్ మూడేళ్ల పాటు సేవలందిస్తారని కేంద్రం వెల్లడించింది.
రిజర్వు బ్యాంకుకు నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. ప్రస్తుతమున్న వారిలో బీపీ కనుంగో ఈ పదవి నుంచి వైదొలగనున్న నేపథ్యంలో కేంద్రం.. రబి శంకర్‌ను ఆయన స్థానంలో భర్తీ చేయనుంది.
ఇదీ చదవండి: 11శాతం ఆక్సిజన్ ఉత్పత్తి రిలయన్స్ నుంచే!