దేశంలో కరోనా ఉద్ధృతి పెరిగిపోతున్న వేళ అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును సెప్టెంబరు 30 వరకు కొనసాగిస్తున్నట్లు పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) ప్రకటించింది. అయితే పరిమిత మార్గాల్లో మాత్రమే కొన్ని పాసింజర్ విమానాలు నడపనున్నట్లు తెలిపింది.
కరోనా కట్టడిలో భాగంగా మార్చి 23 నుంచి అన్ని అంతర్జాతీయ సర్వీసులు నిలిపివేయగా.. ఆ తర్వాత ఆ ఆంక్షలను రెండు సార్లు (జులై 31, ఆగస్టు 31 వరకు) పొడిగిస్తూ వచ్చింది డీజీసీఏ. తాజాగా సెప్టెంబరు నెలాఖరు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇదీ చూడండి: 'అమర వైద్యుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం!'