ETV Bharat / business

ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌ కొత్త వెర్షన్స్‌ ఫీచర్లేంటో తెలుసా? - యాపిల్ న్యూవెర్షన్స్

టెక్‌ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐఫోన్‌ 13, ఆండ్రాయిడ్‌ 12 త్వరలో వచ్చేస్తున్నాయి. మరి... యాపిల్‌ 13 నయా ఫీచర్లేంటి? మినీ, ప్రో మాక్స్‌ 2 మోడల్స్‌ ఒకేసారి విడుదల చేయనున్నారా? టెక్‌వర్గాల్లో అంతా ఇదే చర్చ. గూగుల్‌ ఆండ్రాయిడ్‌ 12లో ప్రైవసీకి పెద్ద పీట..., దానిలో అదిరిపోయే ఫీచర్స్‌ ఇవేనంటూ కబుర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకు, ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌ కొత్త వెర్షన్స్‌ సంగతేంటో మీరు చూసేయండి.

ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌ కొత్త వెర్షన్స్‌ ఫీచర్లేంటో తెలుసా?

author img

By

Published : Feb 20, 2021, 10:12 AM IST

ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌ కొత్త వెర్షన్స్‌ ఫీచర్లేంటో తెలుసా?

గతేడాది ఐఫోన్ 12 సిరీస్‌ ఫోన్లతో సందడి చేసిన యాపిల్‌, ఈ ఏడాది ఐఫోన్ 13ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ ఫోన్ల గురించి ఇప్పటికే రకరకాల వార్తలు వెబ్‌ విహారం చేస్తున్నాయి. ఈ మోడల్‌కు సంబంధించి టెక్‌వర్గాలు విడుదల చేసిన వివరాలేంటో చూద్దాం.

ఐఫోన్ 13 ఫిచర్స్​

ఐఫోన్‌ 13ముందుభాగంలో డాట్‌ ప్రొజెక్టర్‌తో ఇన్‌ఫ్రారెడ్ కెమెరాకు ఒకేమాడ్యూల్‌ ఉంటుంది . దీని వల్ల ముందుభాగంలో నాచ్‌ సైజ్ తగ్గనుంది. ఎల్​ఐడీఏఆర్​ స్కానర్‌ వాడనున్నారు. సెన్సార్‌ షిఫ్ట్‌ ios ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఫోన్ 12 ప్రో మాక్స్‌లోనే ఉంది. దానివల్ల ఫొటో తీసే సమయంలో సెన్సార్‌కి బదులు లెన్స్‌లు కదులుతాయి. 1టీబీ స్టోరేజ్‌, 120హెర్ట్జ్ రిఫ్రెష్‌ రేట్‌ సామర్థ్యంతో, ఎల్​పీవీఓ డిస్‌ప్లే డిజైన్ ఉండబోతుందని అంటున్నారు. ఈ నయా మోడల్‌ను ఐఫోన్‌ 13 లేదా "ఐఫోన్ 12 S” పేరుతో ఈ ఏడాది ద్వితీయార్ధంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

ఆండ్రాయిడ్ 12

సరికొత్త ఫీచర్స్‌తో అలరించే గూగుల్‌ కూడా ఈ ఏడాది ఆండ్రాయిడ్ 12 తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి డెవలపర్స్‌ ప్రివ్యూ త్వరలో రానుందట. ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ తీసుకొచ్చిన ప్రతిసారీ, దాన్ని ఏదో ఒక తీపి పదార్ధం పేరుతో పిలుస్తారు. 2009లో విడుదల చేసిన ఆండ్రాయిడ్ 9 వెర్షన్‌ని కప్‌కేక్‌ అని పిలవడంతో ఈ సంప్రదాయం మొదలైంది. 2019లో ఈ సంప్రదాయానికి తెర దించుతూ ముందు మరో కొత్తపదం చేర్చారు. ఆండ్రాయిడ్ 10ని క్వీన్‌ కేక్‌, ఆండ్రాయిడ్ 11ని రెడ్ వెల్వేట్ కేక్‌ అన్నారు. ఆండ్రాయిడ్ 12ని స్నో కోన్‌గా నామకరణం చేయనునట్లు తెలుస్తోంది.

మెటీరియల్ నెక్ట్స్

గతంలో ఉపయోగించిన థీమ్ రంగులకు భిన్నంగా ఇందులో కొత్త రంగులని పరిచయం చేయనున్నారు. ఇందుకోసం "థీమింగ్ సిస్టం" ఫీచర్‌ ఇస్తున్నారు. అందువల్ల, వినియోగదారుడు నచ్చినట్లు రంగు మార్చుకోవచ్చు. నోటిఫికేషన్ సెంటర్‌లోనూ మార్పులు చేస్తున్నారు. ‘మెటీరియల్ నెక్ట్స్‌’ డిజైన్ తో నోటిఫికేషన్ సెంటర్‌ తీసుకొస్తున్నారు. ఇందులో యాప్‌ నోటిఫికేషన్లతో పాటు ఆండ్రాయిడ్ బిల్ట్‌-ఇన్‌ యాప్స్‌ అప్‌డేట్లు కనిపిస్తాయి.

వన్‌ హ్యాండ్ మోడ్

మెసేజింగ్ యాప్‌ల కోసం ప్రత్యేకంగా "కన్వర్సేషన్స్‌" పేరుతో విడ్జెట్స్‌ తీసుకొస్తున్నారు. వీటిలో మనం యాప్‌ ద్వారా చివరిగా ఎవరితో మాట్లాడాము అనేది తెలుస్తుంది. అలా ప్రతి యాప్‌కి ప్రత్యేక విడ్జెట్‌ ఉంటుందని సమాచారం. అలాగే, ఆండ్రాయిడ్ 12లో ‘వన్‌ హ్యాండ్ మోడ్‌’ ఫీచర్‌ పరిచయం చేస్తున్నారు. ఇది ఫోన్ స్క్రీన్ నిలువు సైజ్‌ను తగ్గిస్తుంది. దీని సాయంతో ఫోన్‌ను సులభంగా ఆపరేట్‌ చేయవచ్చు.

ప్రైవసీకి ప్రాధాన్యం

యాపిల్ ఐఓఎస్​ తరహాలోనే గూగుల్ ఆండ్రాయిడ్ 12లో ప్రైవసీకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇందుకోసం ఫోన్ పైభాగం చివర్లో యూజర్‌కి తెలిసేలా ఆరెంజ్‌, గ్రీన్‌ రంగుల్లో చిన్నపాటి గుర్తులు ఉంటాయి. ఆరెంజ్‌ రంగులో మైక్‌ గుర్తు, గ్రీన్‌ రంగులో కెమెరా గుర్తులు కనిపిస్తాయి. దీని వల్ల మీరు యాప్ ఉపయోగిస్తున్నప్పుడు మీ అనుమతి లేకుండా కెమెరా, ఫోన్ మైక్రోఫోన్‌ పనిచేస్తుంటే సులభంగా తెలిసిపోతుంది.

మాల్‌వేర్ యాప్‌ల నుంచి రక్షణ

2019లో స్క్రోలింగ్ స్క్రీన్‌షాట్స్‌ ఫీచర్‌ తీసుకొస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. అయితే ఆండ్రాయిడ్‌ 10, 11 వెర్షన్‌లో ఈ ఫీచర్‌ తీసుకురాలేదు. ఆండ్రాయిడ్‌ 12లో పక్కగా ఉండనున్నట్లు తెలుస్తోంది. గూగుల్ మరో ప్రతిష్ఠాత్మక ఫీచర్... యాప్ పెయిర్స్‌. దీని సాయంతో ఒకేసారి 2 యాప్‌లు వాడుకోవచ్చు. ప్లేస్టోర్, గెలాక్సీ స్టోర్ తరహాలోనే థర్డ్‌పార్టీ యాప్‌ డెవలపర్స్ కోసం కొత్త స్టోర్‌ను తీసుకొస్తోంది. మాల్‌వేర్ యాప్‌ల నుంచి రక్షణ కోసం ఈ ఏర్పాటని చెబుతున్నారు.

గేమర్స్ కోసం

గేమర్స్‌కు ఆండ్రాయిడ్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. అయితే, స్టాడియా, ఎక్స్‌బాక్స్‌ కంపెనీలు అందించే గేమింగ్‌ అనుభూతి ఇక్కడ దొరకట్లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆండ్రాయిడ్‌ 12లో ప్రత్యేక గేమ్‌ మోడ్‌ రూపొందిస్తున్నారు. ఇవి కాకుండా గూగుల్ పిక్సెల్ ఫోన్ల కోసం ఆండ్రాయిడ్ 12లో ప్రత్యేకంగా కొన్ని ఫీచర్స్‌ తీసుకొస్తున్నారు. వీటిలో డబుల్ ట్యాప్‌తో మ్యూజిక్‌ కంట్రోల్‌ చేయడం, ఫోన్ కెమెరా ఆటో రొటేషన్ వంటి ఫీచర్స్‌ ఉండనున్నట్లు టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి.

అక్టోబరు లేదా నవంబరు నెలలో

నాలుగు సంవత్సరాలుగా ఆండ్రాయిడ్‌ కొత్త వెర్షన్లను ఆగస్టు, సెప్టెంబరుల్లో విడుదల చేశారు. కానీ కొవిడ్-19 పరిస్థితుల నేపథ్యంలో అక్టోబరు లేదా నవంబరు నెలలో విడుదల చేస్తారని అంచనా. బీటా వెర్షన్‌ని మాత్రం ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి రెండో వారంలో విడుదల చేస్తారని టెక్‌ వర్గాల మాట.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.