ETV Bharat / business

స్టాక్ మర్కెట్లలో రెండో రోజూ సడలింపోత్సాహం.. - సెన్సెక్స్

stock opens green
ఆర్థిక, ఆటో రంగాల్లో జోరు.. లాభాల్లో సూచీలు
author img

By

Published : Jun 2, 2020, 9:34 AM IST

Updated : Jun 2, 2020, 3:51 PM IST

15:47 June 02

10 వేల మార్క్​కు చేరువలో నిఫ్టీ..

స్టాక్​ మార్కెట్లు మంగళవారం సెషన్​లో భారీ లాభాలతో మగిశాయి. సెన్సెక్స్ 522 పాయింట్లు బలపడి 33,825 వద్దకు చేరింది. నిఫ్టీ 153 పాయింట్ల వృద్ధితో 9,979 వద్ద స్థిరపడింది.

దేశవ్యాప్తంగా లాక్​డౌన్ సడలింపునకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలు, బ్యాంకింగ్ రంగంలో కొనుగోళ్ల మద్దతు లాభాలకు కారణమైనట్లు నిపుణులు చెబుతున్నారు.

మంగళవారం సెషన్​లో బజాజ్ ఫినాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్​ఇండ్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్ షేర్లు లాభపడ్డాయి.

మారుతీ, ఐటీసీ, ఎన్​టీపీసీ, నెస్లే, హెచ్​యూఎల్, హీరో మోటోకార్ప్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి

13:39 June 02

మరింత జోరు...

మిడ్ సెషన్ తర్వాత స్టాక్ మర్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 470 పాయింట్లు పుంజుకుని 33,770 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 128 పాయింట్లు పెరిగి 9,954 వద్ద ట్రేడవుతోంది.

30 షేర్ల ఇండెక్స్​లో కోటక్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, పవర్ గ్రిడ్​, ఇండస్​ఇండ్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

మారుతీ, ఓఎన్​జీసీ, ఎన్​టీపీసీ, నెస్లే, ఐటీసీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

10:13 June 02

హెవీ వెయిట్​ షేర్ల దన్ను..

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల పవనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 220 పాయింట్లకుపైగా లాభంతో 33,524 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 85 పాయింట్లకుపైగా బలపడి 9,912 వద్ద కొనసాగుతోంది. 

లాక్​డౌన్​ సడలింపులతో ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందన్న అంచనాలు, హెవీ వెయిట్​ షేర్లు సానుకూలంగా స్పందిస్తుండటం కూడా మంగళవారం సెషన్​ లాభాలకు కారణంగా చెబుతున్నారు నిపుణులు.  

  • కోటక్ బ్యాంక్, సన్​ఫార్మా, బజాజ్​ ఫినాన్స్, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎం&ఎం షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • ఎల్​&టీ, మారుతీ, నెస్లే, ఓఎన్​జీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్​బీఐ, ఐటీసీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
  • ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.81 శాతం పెరిగి.. బ్యారెల్​ ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్​లో 38.63 డాలర్లకు చేరింది.

09:53 June 02

కొనసాగుతున్న లాభాలు..

స్టాక్ మార్కెట్లలో లాభాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 320 పాయింట్లకుపైగా వృద్ధితో 33,626 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 100 పాయింట్లకుపైగా పుంజుకుని 9,928 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి.

లాభనష్టాలు..

కోటక్ మహీంద్రా బ్యాంక్ అత్యధికంగా 7 శాతానికిపై లాభంతో ట్రేడవుతోంది. బజాజ్ ఫినాన్స్, సన్​ఫార్మా, ఎం&ఎం, ఏషియన్ పెయింట్స్, హీరో మోటార్స్ షేర్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి.

అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్​&టీ, ఓఎన్​జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్​బీఐలు మాత్రమే 30 షేర్ల ఇండెక్స్​లో నష్టాల్లో ఉన్నాయి.

09:17 June 02

ఆర్థిక, ఆటో రంగాల్లో జోరు.. లాభాల్లో సూచీలు

దేశీయ మార్కెట్లు స్వల్పలాభాలతో ప్రారంభమయ్యాయి. లాక్​డౌన్ ఆంక్షల సడలింపులు, అంతర్జాతీయ సానుకూలతలే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 275 పాయింట్లు లాభపడి 33 వేల 579 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 81 పాయింట్లు వృద్ధి చెంది 9వేల907 వద్ద ట్రేడవుతోంది. 

లాభనష్టాల్లో

కోటక్ బ్యాంకు, ఎమ్ అండ్​ ఎమ్, హీరో మోటోకార్ప్, టాటా స్టీల్, సన్​ఫార్మా, బజాజ్ ఫైనాన్స్ రాణిస్తున్నాయి.

ఉదయ్ కోటక్ పరిమితికి మించి ఉన్న వ్యక్తిగత వాటా రూ.6,800 కోట్లకు విక్రయించాలని నిర్ణయించిన నేపథ్యంలో కోటక్ బ్యాంకు భారీ లాభాలతో రాణిస్తోంది.

ఐసీఐసీఐ బ్యాంకు, ఐటీసీ, ఎల్​ అండ్​ టీ, ఎస్​బీఐ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఆసియా మార్కెట్లు

నిక్కీ, హాంగ్​సెంగ్, కోస్పీ లాభాల్లో కొనసాగుతుండగా, షాంఘై కాంపోజిట్ నష్టాల్లో ట్రేడవుతోంది.

Last Updated : Jun 2, 2020, 3:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.