దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల దిశగా కొనసాగుతున్నాయి. మొదట్లో తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్న మార్కెట్లు నెమ్మదిగా లాభాల వైపు మొగ్గుచూపాయి. అవసరమైతే కీలక వడ్డీ రేట్లలో కోత విధిస్తామని ఆర్బీఐ గవర్నర్ అభయం ఇవ్వడం కలిసి వచ్చినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 480 పాయింట్లు వృద్ధి చెంది 31 వేల 870 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 152 పాయింట్లు లాభపడి 9 వేల 349 వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాల్లో
ఎస్ బ్యాంకు, టాటా స్టీల్, ఆదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, మారుతి సుజుకి, ఓఎన్జీసీ, హెచ్‌యూఎల్ రాణిస్తున్నాయి.
హెచ్డీఎఫ్సీ ట్విన్స్, భారతీ ఇన్ఫ్రాటెల్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఆసియా మార్కెట్లు
కరోనా భయాలతో అంతర్జాతీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలకు ఊతమిచ్చేందుకు ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు చేపడుతున్న ఉద్దీపన చర్యలు, వడ్డీ తగ్గింపు తాయిలాలు మదుపరుల సెంటిమెంట్ బలపరచలేకపోతుండడమే ఇందుకు కారణం. ప్రస్తుతం నిక్కీ, హాంగ్‌సెంగ్, షాంగై కాంపోజిట్ రాణిస్తుండగా, కోస్పీ మాత్రం నష్టాల్లో ట్రేడవుతోంది.
రూపాయి
రూపాయి విలువ 22 పైసలు పెరిగి, ఒక డాలరుకు రూ.74.03గా ఉంది.
ముడిచమురు
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 2.10 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 30.67 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: కరోనా గండంతో ప్రపంచ మార్కెట్లు విలవిల