సెన్సెక్స్ 227 ప్లస్..
చివరి గంటలో లభించిన కొనుగోళ్ల మద్దతుతో స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 227 పాయింట్లు బలపడి.. జీవనకాల గరిష్ఠ స్థాయి అయిన 44,180 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 64 పాయింట్ల వృద్ధితో సరికొత్త రికార్డు స్థాయి అయిన 12,938 వద్దకు చేరింది.
- ఎం&ఎం, బజాజ్ ఫినాన్స్, ఎల్&టీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు లాభాలతో ముగిశాయి.
- హెచ్యూఎల్, టైటాన్, టీసీఎస్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.