ETV Bharat / business

సంస్కరణలపై ఆశలతో లాభాల్లోకి సూచీలు

ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా ప్రభుత్వం సంస్కరణలు చేపడుతుందన్న ఆశలతో... దేశీయ స్టాక్​మార్కెట్లు లాభాలబాట పట్టాయి. ప్రారంభ ట్రేడింగ్​లో నష్టాలు చవిచూసినా క్రమంగా వాహన, బ్యాంకింగ్​ రంగాలు బాగా పుంజుకున్నాయి.

సంస్కరణలపై ఆశలతో.. లాభాల్లోకి స్టాక్​ మార్కెట్లు
author img

By

Published : Sep 9, 2019, 12:55 PM IST

Updated : Sep 29, 2019, 11:40 PM IST

ఇవాళ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ ​మార్కెట్లు... మధ్యాహ్నానికి లాభాల బాట పట్టాయి. సెన్సెక్​ 150 పాయింట్ల నష్టం నుంచి 225 పాయింట్ల లాభంలోకి దూసుకొచ్చింది. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా ప్రభుత్వం సంస్కరణలు చేపడుతుందన్న ఆశలతో దేశీయ మార్కెట్లు పుంజుకున్నాయి. అమెరికా-చైనా వాణిజ్య చర్చల పునఃప్రారంభం, ఫెడ్​ మరోమారు వడ్డీరేట్లు తగ్గిస్తుందనే అంచనాలూ ఇందుకు కారణమే.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 37 వేల 204 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 68 పాయింట్లు వృద్ధి చెంది 11 వేల మార్కు ఎగువన ట్రేడవుతోంది.

లాభాల్లో

జేఎస్​డబ్ల్యూ స్టీల్​, యూపీఎల్​, లార్సెన్​, ఎస్​ బ్యాంకు, హెచ్​యూఎల్, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ మహీంద్రా రాణిస్తున్నాయి.

నష్టాల్లో

హెచ్​సీఎల్​ టెక్​, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్​, బజాజ్ ఆటో, టీసీఎస్​ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఆసియా మార్కెట్లు

నిక్కీ, కోస్పీ, హాంగ్​సెంగ్​, షాంఘై మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి: రుణాలపై వడ్డీరేట్లు మరింత తగ్గించిన స్టేట్ బ్యాంక్

Intro:Body:Conclusion:
Last Updated : Sep 29, 2019, 11:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.