ETV Bharat / business

మార్కెట్లకు స్వల్ప లాభాలు- 13,130పైకి నిఫ్టీ - నేటి స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ, దేశీయ సానుకూలతలతో స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 15 పాయింట్లు బలపడి.. దాదాపు ఫ్లాట్​గా ముగిసింది. నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో స్థిరపడింది. 30 షేర్ల ఇండెక్స్​లో మారుతీ భారీగా లాభపడగా.. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ అధికంగా నష్టపోయింది.

Stock market news Telugu
స్టాక్ మార్కెట్​ వార్తలు
author img

By

Published : Dec 3, 2020, 3:45 PM IST

Updated : Dec 3, 2020, 4:15 PM IST

స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 15 పాయింట్లు బలపడి.. 44,633 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 13,134 వద్దకు చేరింది.

అంతర్జాతీయంగా అమెరికా మార్కెట్లు బుధవారం లాభాలతో ముగియడం వల్ల ఆ సానుకూలతలు దేశీయంగా కనిపించాయి. అయితే ఆరంభంలో దూసుకెళ్లిన సూచీలు.. లాభాల స్వీకరణతో స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి.

డేటా సెంటర్లో అంతరాయాల కారణంగా హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ డిజిటల్ లావాదేవీలను నిలిపివేయాలని ఆర్​బీఐ గురువారం ఆదేశించింది. దీనితో హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఫలితంగా మార్కెట్ల లాభాలు పరిమితమయ్యాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 44,953 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 40,551 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 13,216 పాయింట్ల గరిష్ఠ స్థాయి(సరికొత్త రికార్డు స్థాయి), 13,107 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

మారుతీ(7.45 శాతం) , ఓఎన్​జీసీ, ఏషియన్ పెయింట్స్, ఎన్​టీపీసీ, ఎస్​బీఐ, బజాజ్ ఫిన్​సర్వ్​ లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ (2.13 శాతం), టీసీఎస్​, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్​టెల్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై మినహా.. టోక్యో, సియోల్, హాంకాంగ్ సూచీలు లాభాలను గడించాయి.

రూపాయి, ముడి చమురు

కరెన్సీ మార్కెట్లో రూపాయి 12 పైసలు తగ్గింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ 73.93 వద్దకు చేరింది.

ముడి చమురు ధరల సూచీ బ్రెంట్ 0.33 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 48.09 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:వరుసగా రెండో నెల సేవా రంగం సానుకూలం

Last Updated : Dec 3, 2020, 4:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.