దేశ ఆర్థికవృద్ధి పునరుద్ధరణకు, పన్ను సమస్యల పరిష్కారానికి కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇవాళ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచి సెన్సెక్స్ 254 పాయింట్లు వృద్ధిచెంది 37 వేల 581 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 77 పాయింట్లు లాభపడి 11 వేల 109 వద్ద స్థిరపడింది.
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులతో సమావేశమైన ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్, పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను బలపరిచేలా ప్యాకేజీని అందిస్తారన్న వార్తలతోనూ దేశీయ మార్కెట్లు ఊపందుకున్నాయి.
లాభాల్లో
మారుతీ సుజుకీ, బజాజ్ ఫిన్సెర్వ్, బజాజ్ ఫైనాన్స్, వేదాంత, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్‌యూఎల్, కోటక్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు (3.36 శాతం) రాణించాయి.
నష్టాల్లో
ఎస్ బ్యాంకు 7.91 శాతం నష్టపోయింది. సిప్లా, హిందాల్కో, టెక్ మహీంద్ర, కోల్ ఇండియా, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఐటీసీ, సన్‌ఫార్మా (2.50 శాతం) నష్టపోయాయి.
ఆసియా మార్కెట్లు
ఆసియా మార్కెట్లైన షాంగై కాంపోజిట్ ఇండెక్స్, హాంగ్‌సెంగ్, కోస్పీ, నిక్కీ మిశ్రమ ఫలితాలతో ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లు ప్రారంభ ట్రేడింగ్‌లో నష్టాలతో కొనసాగుతున్నాయి.
రూపాయి విలువ
ఇంట్రాడేలో రూపాయి విలువ 12 తగ్గింది. ప్రస్తుతం ఒక డాలరుకు రూ.70.81గా ఉంది.
ముడిచమురు ధర
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 0.73 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 57.80 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: 10కోట్ల మంది రైతులకు పెట్టుబడి సాయం