స్టాక్ మార్కెట్లపై బేర్ పంజా సోమవారం కూడా కొనసాగింది. బీఎస్ఈ-సెన్సెక్స్ 531 పాయింట్లు తగ్గి 48,347 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ- నిఫ్టీ 133 పాయింట్లు కోల్పోయి 14,238 వద్ద స్థిరపడింది. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, రిలయన్స్ షేరు భారీగా నష్టపోవడం కారణంగా మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి.
దాదాపు అన్ని రంగాల ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ఐటీ,ఆటో షేర్లు అత్యధిక నష్టాలను నమోదు చేశాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 49,263 పాయింట్ల అత్యధిక స్థాయి, 48,274 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 14,491 పాయింట్ల గరిష్ఠ స్థాయి 14,223 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
30 షేర్ల ఇండెక్స్‌లో బజాజ్ ఆటో, సన్‌ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, టైటాన్ షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి.
రిలయన్స్, కోటక్‌బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, పవర్ గ్రిడ్,ఏసియన్ పెయింట్స్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన స్టాక్ మార్కెట్లు అయిన.. షాంఘై, టోక్యో, సియోల్, హాంకాంగ్ సూచీలు భారీగా లాభాలను ఆర్జించాయి.
- గణతంత్ర దినోత్సవం కారణంగా మంగళవారం మార్కెట్లకు సెలవు.
ఇదీ చూడండి: రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా పతనం