ETV Bharat / business

లాభాలతో ముగిసిన మార్కెట్లు.. సెన్సెక్స్ 214+

author img

By

Published : Aug 21, 2020, 9:26 AM IST

Updated : Aug 21, 2020, 6:04 PM IST

stocks today
నేటి స్టాక్ మార్కెట్లు

15:44 August 21

వారాంతంలో లాభాలు

వారాంతంలో లాభాలు...

స్టాక్ మార్కెట్లు వారంలో చివరి సెషన్​ను లాభాలతో ముగించాయి. విద్యుత్​, ఆర్థిక షేర్లు రాణించడం లాభాలకు కారణం. శుక్రవారం సెషన్​లో సెన్సెక్స్ 214 పాయింట్లు వృద్ధి చెంది 38,435 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 59 పాయింట్లు బలపడి 11,372 వద్దకు చేరింది.

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లన్ని కూడా శుక్రవారం సానుకూలంగా స్పందించడం.. దేశీయంగా సూచీలకు కలిసొచ్చింది.

  • ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్, ఏషియన్​ పెయింట్స్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, సన్​ఫార్మా లాభపడ్డాయి.
  • భారతీ ఎయిర్​టెల్, ఓఎన్​జీసీ, టాటా స్టీల్, హెచ్​సీఎల్​టెక్, రిలయన్స్ షేర్లు నష్టపోయాయి.

11:58 August 21

మిడ్​ సెషన్​లోనూ అదే జోరు..

స్టాక్ మార్కెట్లు మిడ్​ సెషన్​ తర్వాత కూడా భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 280 పాయింట్లకుపైగా లాభంతో 38,502 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 82 పాయింట్లకుపైగా బలపడి 11,394 వద్ద కొనసాగుతోంది.

  • విద్యుత్​, బ్యాంకింగ్ షేర్ల దన్నుతో సూచీల జోరు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఐటీ షేర్లు కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి.
  • పవర్​గ్రిడ్​, ఎన్​టీపీసీ, ఎస్​బీఐ, ఏషియన్ పెయింట్స్, సన్​ఫార్మా లాభాల్లో ఉన్నాయి.
  • హెచ్​సీఎల్​టెక్, భారతీ ఎయిర్​టెల్, ఇన్ఫోసిస్​, ఎం&ఎం, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

08:58 August 21

తేరుకున్న సూచీలు

చివరి సెషన్​లో నమోదైన నష్టాల నుంచి తేరుకుని శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి స్టాక్ మార్కెట్లు. బీఎస్​ఈ-సెన్సెక్స్ 300 పాయింట్లకుపైగా బలపడి 38,525 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ దాదాపు 90 పాయింట్లు పుంజుకుని 11,400 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

దాదాపు అన్ని రంగాలు సానుకూలంగా స్పందిస్తుండటం లాభాలకు కారణంగా తెలుస్తోంది.

పవర్​గ్రిడ్, ఎస్​బీఐ, టాటా స్టీల్, ఎన్​టీపీసీ, ఓఎన్​జీసీ, టెక్​ మహీంద్రా షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

Last Updated : Aug 21, 2020, 6:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.