దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ ట్విన్స్ రాణించడం ఇందుకు దోహదపడ్డాయి. యూఎస్- చైనా తొలిదశ వాణిజ్య ఒప్పందంపై జనవరి 15న సంతకం చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించడం, చైనా సెంట్రల్ బ్యాంకు ఉద్దీపనలు ప్రకటించడం కలిసొచ్చింది.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 320 పాయింట్లు వృద్ధి చెంది 41,626 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 99 పాయింట్లు లాభపడింది. 12,282 పాయింట్లతో జీవనకాల గరిష్ఠం వద్ద ముగిసింది.
లాభనష్టాల్లో
అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, గ్రాసిమ్, ఇండస్ ఇండ్ బ్యాంకు, లార్సెన్ అండ్ టుబ్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఓఎన్జీసీ, ఐటీసీ రాణించాయి.
బజాజ్ ఆటో, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, నెస్లే ఇండియా, కోటక్ మహీంద్రా, హీరోమోటోకార్ప్ నష్టపోయాయి.
ఆసియా మార్కెట్లు
హాంగ్‌సెంగ్, షాంగై కాంపోజిట్ లాభపడగా... నిక్కీ, కోస్పీ నష్టపోయాయి. యూరోపియన్ మార్కెట్లు కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి.
రూపాయి విలువ
రూపాయి విలువ 11 పైసలు తగ్గి, ఒక డాలరుకు రూ.71.33గా ఉంది.
ముడిచమురు
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 0.42 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 66.28 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: ఎయిర్ ఇండియా, బీపీసీఎల్ల ప్రైవేటీకరణ ఇప్పట్లో కష్టమే!