ETV Bharat / business

ఆర్​బీఐ వడ్డీ రేట్లు తగ్గించినా భారీ నష్టాల దిశగా - సెన్సెక్స్

STOCK MARKET OPENS RED
కరోనా భయాలతో ఒడుదొడుకుల్లో మార్కెట్లు
author img

By

Published : May 22, 2020, 9:38 AM IST

Updated : May 22, 2020, 10:44 AM IST

10:37 May 22

భారీ నష్టాల దిశగా స్టాక్​మార్కెట్లు

భారీ నష్టాల దిశగా స్టాక్​మార్కెట్లు

ఆర్​బీఐ కీలక వడ్డీ రేట్లు తగ్గించినట్లు ప్రకటించినా... దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకుంటున్నాయి. కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతుండడం, ఆర్థిక మాంద్యం భయాలు, విదేశీ పెట్టుబడులు తరలివెళుతుండడమే ఇందుకు కారణం. 

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంచి సూచీ సెన్సెక్స్​ 348 పాయింట్లు కోల్పోయి 30 వేల 584 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 89 పాయింట్లు నష్టపోయి 9 వేల 16 వద్ద ట్రేడవుతోంది.  

లాభనష్టాల్లో..

ఇన్ఫోసిస్, ఎస్​బీఐ, రిలయన్స్, హీరో మోటోకార్ప్, టెక్​ మహీంద్రా, రిలయన్స్, సన్​ఫార్మా, టైటాన్ రాణిస్తున్నాయి.

టాటా స్టీల్, ఐటీసీ, ఓఎన్​జీసీ, ఎన్​టీపీసీ, హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్, ఎల్​ అండ్ టీ నేలచూపులు చూస్తున్నాయి.

ఆసియా మార్కెట్లు

అమెరికా చైనా ఉద్రిక్తతల నడుమ షాంఘై, టోక్యో, సియోల్​ స్టాక్​మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. హాంగ్​కాంగ్ నగర భద్రత చట్టాన్ని రూపొందించడానికి చైనా సన్నద్ధమవుతున్న నేపథ్యంలో హాంగ్​కాంగ్​ మార్కెట్లు భారీ నష్టపోతున్నాయి. మరోవైపు వాల్​ స్ట్రీట్​ కూడా నష్టాలతో ముగిసింది.

ముడిచమురు

అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధర 3.72 శాతం తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 34.72 డాలర్లుగా ఉంది.

10:13 May 22

నష్టాల్లో ట్రేడవుతున్న మార్కెట్లు

దేశీయ స్టాక్​మార్కెట్లు మరింతగా నష్టాల్లోకి జారుకుంటున్నాయి. 

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంచి సూచీ సెన్సెక్స్​ 100 పాయింట్లు కోల్పోయి 30 వేల 832 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 36 పాయింట్లు నష్టపోయి 9 వేల 70 వద్ద ట్రేడవుతోంది.  

09:06 May 22

కరోనా భయాలతో ఒడుదొడుకుల్లో మార్కెట్లు

దేశీయ మార్కెట్లు ఒడుదొడుకులతో కొనసాగుతున్నాయి. కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతుండడం, ఆర్థిక మాంద్యం భయాలు, విదేశీ పెట్టుబడులు తరలివెళుతుండడమే ఇందుకు కారణం. అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు కూడా మార్కెట్​పై ప్రభావం చూపిస్తున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంచి సూచీ సెన్సెక్స్​ 27 పాయింట్లు కోల్పోయి 30 వేల 905 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 17 పాయింట్లు నష్టపోయి 9 వేల 88 వద్ద ట్రేడవుతోంది.  

ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంతదాస్​ ఇవాళ ఉదయం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ఆర్థిక వ్యవస్థ స్వయం సమృద్ధి కోసం పలు సంస్కరణలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.  

రిలయన్స్ జియోలో ప్రముఖ ఈక్విటీ సంస్థ కొహెల్​బర్గ్​ క్రావిస్ రాబర్ట్స్​ (కేకేఆర్​) రూ.11,367 కోట్ల మేర పెట్టుబడులు పెట్టి 2.32 శాతం వాటాను పొందింది. ఇదీ మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశముంది.

Last Updated : May 22, 2020, 10:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.