ETV Bharat / business

భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు- ​సెన్సెక్స్ 768 పాయింట్లు పతనం

Stock Market Close: ఉక్రెయిన్​- రష్యా యుద్ధప్రభావంతో దేశీయ స్టాక్​ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్​ఈ సూచీ సెన్సెక్స్ 768 పాయింట్లు​ నష్టపోయింది. నిఫ్టీ 252 పాయింట్లు కోల్పోయింది.

Stock Market Close
స్టాక్​ మార్కెట్లు
author img

By

Published : Mar 4, 2022, 3:43 PM IST

Stock Market Close: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. రష్యా- ఉక్రెయిన్​ యుద్ధ ప్రభావంతో మార్కెట్లకు వరుస నష్టాలు తప్పలేదు. అంతర్జాతీయంగా అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 768 పాయింట్లు నష్టపోయింది. 54వేల 333 వద్దకు చేరింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 252 పాయింట్లు పడిపోయి.. 16 వేల 245 వద్ద ఉంది.

ఉక్రెయిన్ న్యూక్లియర్​ ప్లాంట్​పై రష్యా అటాక్​ అనే వార్తలతో మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. శుక్రవారం 450 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్.. 55వేల 103 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఆఖర్లో 54 వేల 333 వద్ద ముగిసింది.

లాభనష్టాల్లో..

డాక్టర్​రెడ్డీస్​, ఐటీసీ, టెక్​మహీంద్రా, సన్​ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ లాభాల్లో ఉన్నాయి.

టైటాన్స్​, ఏషియన్​పెయింట్స్, మారుతీ, మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ డీలాపడ్డాయి.

ఇదీ చదవండి: టాటా మోటార్స్‌ వినూత్న కార్యక్రమం​.. ఇక ఊళ్లలోకి షోరూమ్‌లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.