ETV Bharat / business

కేంద్రం బాటలో పలు రాష్ట్రాలు- పెట్రో ధరలపై వ్యాట్​ తగ్గింపు

ఇంధన ధరల భారం నుంచి సామాన్యుడికి ఉపశమనం కలిగిస్తూ.. పెట్రోల్, డీజిల్​పై ఎక్సైజ్​ సుంకాన్ని కేంద్రం తగ్గించింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు కూడా చమురు ధరలపై వ్యాట్​ను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఏయే రాష్ట్రాలు, ఎంత మేర వ్యాట్​ తగ్గించాయంటే..?

vat on petrol and diesel
పెట్రోల్​, డీజిల్​పై వ్యాట్ తగ్గింపు
author img

By

Published : Nov 4, 2021, 5:17 AM IST

పెట్రో ధరల పెంపుతో సతమతమవుతున్న వినియోగదారులకు కొంత ఉపశమనం లభించింది. కొన్నిరోజులుగా అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గింపుతో సామాన్యులకు ఊరట లభిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. మరోవైపు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రాలు కూడా పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్​ను తగ్గిస్తున్నాయి.

  • ఉత్తర్​ప్రదేశ్​లో పెట్రోల్​, డీజిల్​పై వ్యాట్​ను రూ.12 మేర తగ్గిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
  • పెట్రోల్‌, డీజిల్‌పై రూ.7 చొప్పున వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. ఈ తగ్గింపుతో సామాన్యులకు ఊరట లభించడం సహా ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందని చెప్పారు.
  • అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కూడా పెట్రోల్‌, డీజిల్‌పై రూ.7 చొప్పున వ్యాట్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
  • త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్‌ కుమార్‌ దేబ్‌ కూడా పెట్రోల్‌, డీజిల్‌పై రూ.7 చొప్పున వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.
  • సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్‌ తమంగ్‌ కూడా పెట్రోల్‌, డీజిల్‌పై రూ.7 చొప్పున వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు తెలిపారు.
  • మణిపుర్‌ ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ కూడా రూ.7 చొప్పున వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు.
  • కేంద్రం విజ్ఞప్తితో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై రూ.7 రూపాయల చొప్పున వ్యాట్‌ను తగ్గించారు.
  • గుజరాత్​లో పెట్రోల్, డీజిల్​పై రూ.7 చొప్పున వ్యాట్ తగ్గిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
  • ఉత్తరాఖండ్​లో​ పెట్రోల్​పై వ్యాట్​ను రూ.2 మేర తగ్గిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు.
  • పెట్రోల్​, డీజిల్​ ధరలపై వ్యాట్​ను తగ్గిస్తామని హిమాచల్ ప్రదేశ్​ ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్​ను విడుదల చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్​ తెలిపారు.

ఇదే తరహాలో మరిన్ని రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్​పై వ్యాట్​ను తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా త్వరలో 10వేల ఈవీ ఛార్జింగ్​ స్టేషన్స్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.