ETV Bharat / business

Star Health IPO: స్టార్​హెల్త్​ ఐపీఓ తేదీ ఖరారు- వివరాలివే.. - స్టార్​ హెల్త్​ ఐపీఓ తేదీ

స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐపీఓ(Star health IPO) సబ్​స్క్రిప్షన్​ తేదీని ప్రకటించింది. నవంబరు 30న ప్రారంభం కానుండగా.. డిసెంబరు 2న ముగియనుంది. మరోవైపు.. తాజాగా ఏడు కంపెనీల ఐపీఓ దరఖాస్తులకు సెబీ ఆమోద ముద్ర వేసింది.

Star Health IPO
స్టార్​హెల్త్​ ఐపీఓ తేదీ ఖరారు
author img

By

Published : Nov 24, 2021, 4:32 PM IST

ఆరోగ్య బీమా సంస్థ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ ఐపీఓ(Star health IPO) సబ్‌స్క్రిప్షన్‌ ఈ నెల 30న(Star health IPO) ప్రారంభం కానుంది. డిసెంబరు 2న ముగుస్తుంది. యాంకర్​ ఇన్వెస్టర్లకు ఈ నెల 29న సబ్​స్క్రిప్షన్​ ప్రారంభం కానుంది. ఒక్కొ షేరు ధర రూ.870-900 గా(Star health IPO price) నిర్ణయించింది.

మొత్తం రూ.7,249 కోట్లు సమీకరించడమే లక్ష్యంగా పెట్టుకుంది స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్. ఇందులో రూ.2000 కోట్లు విలువైన షేర్లను ఇష్యూ చేస్తుండగా.. మరో 58,324,225 షేర్లు ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించనున్నారు.

పబ్లిక్​ ఇష్యూలో.. సంస్థలో పని చేసే ఉద్యోగుల కోసం రూ.100 కోట్లు విలువైన షేర్లను రిజర్వు చేసింది. ఇష్యూ పరిమాణంలో 75 శాతం క్వాలిఫైడ్​ ఇనిస్టిట్యూషనల్​ బయ్యర్స్​కు (క్యూఐబీలు), 15 శాతం నాన్​-ఇన్‌స్టిట్యూషనల్​ ఇన్వెస్టర్లలకు, మిగిలిన 10 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు ఇష్యూ చేయనుంది.

స్టార్​ హెల్త్​.. దేశంలోని ప్రముఖ ప్రైవేటు ఆరోగ్య బీమా సంస్థ. వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్​, బిగ్ బుల్ రాకేశ్ ఝున్​ఝున్​వాలా(Rakesh Jhunjhunwala Airlines) వంటి పెట్టుబడిదారుల కన్సార్టియం యాజమాన్యంలో ఉంది.

మరో ఏడు కంపెనీల ఐపీఓలకు సెబీ గ్రీన్ సిగ్నల్​

తాజాగా ఏడు కంపెనీల ఐపీఓ దరఖాస్తుకు సెబీ ఆమోద ముద్ర వేసింది. ​

మెడ్‌ప్లస్

మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్(medplus health ipo).. మొత్తం రూ.1,639 కోట్లు సమీకరించడమే లక్ష్యంగా ఐపీఓ దరఖాస్తు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో రూ.600 కోట్లు విలువైన షేర్లు ఇష్యూ చేయనుండగా.. మరో రూ.1,038.71 కోట్ల విలువైన షేర్లను ఆఫర్​ ఫర్​ సేల్​ కింద విక్రయించనుంది.

రేట్‌గెయిన్​ ట్రావెల్​​ టెక్నాలజీస్​

తాజా షేర్ల ద్వారా రూ.400 కోట్లు సమీకరించనున్నారు. ఆఫర్​ ఫర్​ సేల్​ కింద 2.26 కోట్ల షేర్లను ఐపీఓలో విక్రయానికి ఉంచనున్నారు. ఈ ఐపీఓ ద్వారా సమీకరించే నిధులను రుణాల చెల్లింపు, సాంకేతిక అభివృద్ధి, కృత్రిమమేధ, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించుకోనుంది కంపెనీ.

ఫ్యూజన్​ మైక్రో ఫైనాన్స్​

రూ.600 కోట్లు విలువైన కొత్త షేర్లను ఫ్యూజన్​ మైక్రో ఫైనాన్స్​ జారీ చేయనుంది. ఆఫర్​ ఫర్​ సేల్​ కింద మరో 2.19 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు.

ప్రూడెంట్ కార్పొరేట్​ అడ్వైజరీ సర్వీసెస్

పూర్తిగా(85,49,340 షేర్లు) ఆఫర్​ ఫర్ సేల్​ ద్వారానే విక్రయించనుంది.

పురాణిక్​ బిల్డర్స్

రియల్ ఎస్టేట్ డెవలపర్​ పురాణిక్​ బిల్డర్స్​.. రూ.510 కోట్ల విలువైన కొత్త షేర్లతో పాటు.. ఆఫర్​ ఫర్​ సేల్​లో మరో 9.45 లక్షల షేర్లను విక్రయించనుంది. ఇందులో రవీంద్ర పురాణిక్, గోపాల్ పురాణిక్​ 4,72,500 షేర్లు చొప్పున విక్రయించనున్నారు. సమీకరించే నిధులను రుణాల చెల్లింపు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించుకోనున్నారు.

ట్రాక్‌ఎక్స్ఎన్​ టెక్నాలజీస్​

పూర్తిగా(3.86 కోట్ల షేర్లు) ఆఫర్​ ఫర్ సేల్​ ద్వారానే విక్రయించనుంది.

మొబిక్విక్​

ఫిన్​టెక్​ సంస్థ మొబిక్విక్​ ఐపీఓకు సెబీ మంగళవారం ఆమోదం తెలిపింది. రూ.1900 కోట్లు నిధుల సమీకరణ లక్ష్యంతో ఇష్యూకు రానుంది. సరైన సమయంలో ఐపీఓ సబ్​స్క్రిప్షన్​ను ప్రారంభించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ​

ఇదీ చూడండి: Paytm share price: 2 రోజుల్లోనే రూ. 50వేల కోట్ల సంపద ఆవిరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.