ETV Bharat / business

'ఫేస్​బుక్' క్లాసిక్​ లుక్​కు త్వరలోనే గుడ్​బై - ఫేస్​బుక్​ వెర్షన్​ 2020

ఫేస్​బుక్​ వెర్షన్​లో త్వరలోనే అనేక మార్పులు కనిపించనున్నాయి. వెబ్​ బ్రౌజర్​ ఓపెన్​ చేయగానే నీలం రంగులో దర్శనమిచ్చే ఫేస్​బుక్​.. త్వరలోనే ఆ లుక్​కు టాటా చెప్పనుంది. దాని స్థానంలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరిశీలనలో ఉన్న కొత్త లుక్​ను అందుబాటులోకి తేనుంది. ఇంతకీ ఆ న్యూలుక్​ ఏంటి? అదెలా కనిపించనుంది.. ఆ వివరాలు మీకోసం..

soon-Facebook-good-bye-to-its-classic-look
పాత లుక్‌కు ఫేస్‌బుక్‌ గుడ్‌బై
author img

By

Published : Aug 22, 2020, 4:24 PM IST

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌ తన వెబ్‌ వెర్షన్‌లో మార్పులు చేయబోతోంది. ఇన్నాళ్లూ అందుబాటులో ఉన్న తన క్లాసిక్‌ లుక్‌కు త్వరలోనే గుడ్‌బై చెప్పనుంది. యూజర్లందరికీ కొత్త లుక్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది.

మనం ఫేస్‌బుక్‌ తెరవగానే నీలం చార, తెలుపు, నలుపు అక్షరాలు దర్శనమిస్తాయి. ఏళ్లుగా ఇదే యూఐలో ఫేస్‌బుక్‌ చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వస్తోంది. తాజాగా కొత్త లుక్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే కొందరికి ప్రయోగాత్మకంగా ఈ లుక్‌ అందుబాటులోకి తెచ్చింది. వారికి తమ పాత లుక్‌లో మారేందుకు వీలుగా డ్రాప్‌డౌన్‌ మెనూలో క్లాసిక్‌ లుక్‌కు మారే వీలు కల్పిస్తోంది. అయితే, సెప్టెంబర్‌ నుంచి ఇక క్లాసిక్‌ లుక్‌కు గుడ్‌బై చెప్పాలని ఫేస్‌బుక్‌ భావిస్తోంది. ఇకపై అందరికీ న్యూ లుక్‌ మాత్రమే కనిపించనుంది.

డార్క్​మోడ్​ ఫీచర్​..

గతంలో కనిపించే నీలి చారకు కొత్త వెర్షన్‌లో ఫేస్‌బుక్‌ స్వస్తి చెప్పింది. కొత్తగా డార్క్‌మోడ్‌ను పరిచయం చేసింది. కొత్త లుక్‌లో సెర్చ్‌, హోమ్‌, వాచ్‌, మార్కెట్‌ప్లేస్‌, గ్రూప్స్‌, గేమింగ్‌ పేజెస్‌, ప్రొఫైల్‌, క్రియేట్‌, మెసెంజర్‌, నోటిఫికేషన్‌, డ్రాప్‌డౌన్‌ మెనూ విడివిడిగా పెద్ద ఐకాన్స్‌తో కనిపిస్తున్నాయి. గతంలో పోలిస్తే లోడింగ్‌లో వేగం, స్క్రోలింగ్‌‌లో స్మూత్‌నెస్‌ ఇందులో ప్రత్యేకతంగా కనిపిస్తాయి.

ఇదీ చదవండి: 23.5 కోట్ల మంది డేటా డార్క్​ వెబ్​లో లీక్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.