ETV Bharat / business

స్కోడా 2.0: భారత మార్కెట్లోకి మరో 4 మోడళ్లు - స్కోడాలో ఫోక్స్​వేగన్​ పెట్టుబడులు

భారత మార్కెట్​లో తమ కంపెనీ వ్యాల్యూను పెంచుకోవడంపై ప్రముఖ ఆటోమేకర్​ సంస్థ స్కోడా దృష్టి సారించింది. ఇందులో భాగంగా.. ఈ ఏడాది చివరినాటికి మరో నాలుగు కొత్త మోడళ్లను తీసుకురానుంది. ఏటా లక్ష కార్లను విక్రయించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

Skoda lines up new products
2021 చివరినాటికి మరో నాలుగు మోడళ్లతో స్కోడా!
author img

By

Published : Mar 22, 2021, 8:50 AM IST

భారత్​లో తమ మార్కెట్​ను విస్తరించుకునేందుకు ప్రముఖ ఆటోమేకర్​ 'స్కోడా' ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా.. భారతీయ ప్రయాణికులకు అనువుగా ఉండే.. వివిధ మోడళ్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఆ కంపెనీకి చెందిన ఓ అధికారి తెలిపారు.

ఇండియా 2.0 ప్రాజెక్టుతో..

2018లో ఫోక్స్​ వ్యాగన్​తో జత కట్టిన స్కోడా సంస్థ.. ఇండియా 2.0 ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా భారతీయ వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా, తక్కువ ధరలో, సంతృప్తికరమైన అనుభూతినిచ్చే వాహనాలను విడుదల చేయాలని నిర్ణయించుకుంది. తద్వారా తమ బ్రాండ్​ వ్యాల్యూను భారత్​లో విస్తరింపజేయాలని భావిస్తోంది.

మరో నాలుగు మోడళ్లు..

ప్రస్తుతం స్కోడా రెండు మోడళ్లనే భారత మార్కెట్లో విడుదల చేసింది. ఏడాదికల్లా ఇటీవలే అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసిన ఎస్​యూవీ కుషక్​ సహా మరో నాలుగు మోడళ్లను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది చివరినాటికి 150 డీలర్​షిప్​ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

భారీగా పెట్టుబడులు..

భారత వాహన రంగంలో 5 శాతం మార్కెట్ విలువను సొంతం చేసుకోవాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని స్కోడా ఆటో ఫోక్స్​వ్యాగన్​​ భారత మేనేజింగ్​ డైరెక్టర్​ గురుప్రతాప్​ బోపరాయ్​ తెలిపారు. ఈ మేరకు ఫోక్స్​వ్యాగన్​ గ్రూప్​ తమ సంస్థలో 1 బిలియన్​ యూరోలను పెట్టుబడిగా పెడుతున్నట్లు చెప్పారు.

ఆ నాలుగు మోడళ్లు ఇవే..

రాబోయే సంవత్సరాల్లో ఏడాదికి లక్ష కార్ల చొప్పున విక్రయించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్​ జాక్​ హోలిస్​ తెలిపారు. తాము విడుదల చేయబోయే వివిధ మోడళ్ల గురించి వివరించారు.

"కుషక్​ను ఈ ఏడాది జులైనాటికి అందుబాటులోకి తెస్తాం. ఏప్రిల్​ చివరినాటికి ఆక్టావియా మోడల్​ను విడుదల చేస్తాం. మూడో త్రైమాసికంలో బీఎస్​-6 వెర్షన్​తో కొడైక్​ ఎస్​యూవీని తీసుకువస్తాం. ఇండియా2.0 ప్రాజెక్టులో భాగంగా ఈ ఏడాది చివరినాటికి సెడాన్​ మోడల్​ను విడుదల చేస్తాం."

-జాక్​ హోలిస్​, స్కోడా ఆటో ఇండియా బ్రాండ్​ డైరెక్టర్​

తమ సంస్థను గతేడాది 65 డీలర్​షిప్​ కేంద్రాలతో స్థాపించామని, ఏడాది చివరినాటికి 100 అవుట్​ లెట్లను నెలకొల్పామని జాక్​ హోలిస్​ చెప్పారు. ఈ ఏడాది చివరినాటికి ఆ సంఖ్యను 150కి పెంచుతామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఆరామ్​కోపై కొవిడ్​ దెబ్బ- 2020 లాభం సగానికి పతనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.