బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) పెంచేందుకు మార్గం సుగమం చేసే చట్ట సవరణ బిల్లును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో సోమవారం ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే ఈ రంగంలో 74 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి లభిస్తుంది.
బీమా చట్టం- 1938కి సవరణ చేస్తూ కేంద్ర కేబినెట్ ఈనెల 11నే ఆమోద ముద్ర వేసింది.
ఇప్పటివరకు బీమా రంగంలో గరిష్ఠంగా 49శాతం వరకు విదేశీ పెట్టుబడులకు ఆస్కారం ఉండేది. తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఎఫ్డీఐల వాటాను పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. ఈ సవరణ బిల్లుతో బోర్డులో ఎక్కువ మంది డైరెక్టర్లు, యాజమాన్యంలో ఉండే కీలక వ్యక్తులు భారతీయులై ఉండాలని పేర్కొన్నారు. అంతేగాక బోర్డులో 50శాతం మంది డైరెక్టర్లు స్వతంత్రులై ఉండాలని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: ఆరోగ్య రంగం హర్షం- నిరాశలో పర్యటకం!