ETV Bharat / business

లాక్​డౌన్​ వేళ ప్రజలు ఇంత ఆరోగ్యంగా తయారయ్యారా?

ప్రమాద బీమా కోసం ఎవరూ క్లెయిం చేయడంలేదు. అత్యవసర కేసులని చెప్పి ఆరోగ్య బీమాను ఉపయోగించుకునేవారు బాగా తగ్గిపోయారు. కరోనా లాక్​డౌన్​ వేళ... బీమా రంగంలో వచ్చిన మార్పులివి. ఎందుకిలా? దేశ ప్రజలంతా ఒక్కసారిగా ఆరోగ్యంగా మారిపోయారా? లేక... ఈ పెండింగ్​ కేసులన్నీ బీమా రంగంపై ఒకేసారి పిడుగులా వచ్చిపడతాయా?

'health' bomb
లాక్​డౌన్​
author img

By

Published : Apr 4, 2020, 2:25 PM IST

Updated : Apr 4, 2020, 3:01 PM IST

ఆరోగ్య, ప్రమాద బీమా రంగంపై కరోనా ప్రభావం పడినట్లు నిపుణులు చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా అత్యవసర అడ్మిషన్లు, బీమా క్లెయింలు భారీగా తగ్గినట్లు వెల్లడించారు. అయితే లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఆరోగ్యంగా తయారయ్యారా? లేదా భవిష్యత్తులో ఒక్కసారిగా ఏదైనా విస్ఫోటనం సంభవించబోతుందా అని అనుమానిస్తున్నారు.

దేశవ్యాప్తంగా లాక్​డౌన్ విధించడం వల్ల కాలుష్య స్థాయిలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా శ్వాసకోశ సమస్యలు గణనీయంగా తగ్గాయని అంటున్నారు నిపుణులు. ప్రజలు తమ కుటుంబసభ్యులతో ఉంటూ ఇంటి భోజనం తినడం ద్వారా వారిలో ఒత్తిడి స్థాయిలు తగ్గుతున్నట్లు చెబుతున్నారు.

అపెండిసైటిస్ వంటి కేసులు సైతం తగ్గుముఖం పట్టడం వల్ల అత్యవసర బీమా క్లెయింలు తగ్గాయని ఇన్సూరెన్స్ అధికారులు పేర్కొన్నారు.

"రవాణా నిలిచిపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతోంది. అత్యవసరం కాని శస్త్ర చికిత్సలను ఆస్పత్రులు వాయిదా వేస్తున్నాయి. అత్యవసర క్లెయింలు తగ్గేందుకు ఇవి కూడా ఓ కారణం."

-బీమా రంగ నిపుణులు

ఆస్పత్రుల్లోనూ అత్యవసర కేసుల అడ్మిషన్ల సంఖ్య తగ్గినట్లు స్టార్ హెల్త్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాశ్ పేర్కొన్నారు. లాక్ డౌన్ తర్వాత రోజుకు 10 అత్యవసర కేసులు వస్తున్నట్లు 'మెడ్ ఇండియా' ఆస్పత్రి ఫౌండర్​ ఛైర్మన్​ టీఎస్​ చంద్రశేఖర్ వెల్లడించారు. అయితే బీమా సంస్థలకు తక్కువ క్లెయింలు రావడానికి పలు కారణాలు విశ్లేషించారు. ప్రజలు దగ్గర్లోని ఆస్పత్రులకు వెళ్లడానికి మొగ్గుచూపడం, ఆస్పత్రిలో చేరితే కరోనా బాధితులని అనుకుంటారన్న భయాందోళనల వల్ల కేసులు తగ్గినట్లు పేర్కొన్నారు.

ఇతర ఆందోళనలున్నాయి!

వాతావరణంలో కాలుష్యం తగ్గినా, ప్రజలు సిగరెట్ల వినియోగం తగ్గించి ఇంటివద్దే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పటికీ... ఒక్కసారిగా వారి అనారోగ్య స్వభావాన్ని మార్చలేవని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఇంటి వద్ద ఉండటం వల్ల ఒత్తిడి తగ్గినప్పటికీ.. భవిష్యత్తు ఆదాయ వనరులపై ఆందోళనలు ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: చైనాలో కరోనా 2.0​- వుహాన్​లో మళ్లీ ఆంక్షలు!

Last Updated : Apr 4, 2020, 3:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.