ETV Bharat / business

ప్రతికూలతల మధ్య బడ్జెట్- కేంద్రం చేయాల్సిందేంటి?

దేశం తీవ్ర ఆర్థిక మందగమనం ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. వృద్ధి సూచీలన్నీ ఏళ్ల కనిష్ఠ స్థాయికి దిగజారుతున్న తరుణంలో బడ్జెట్​లో కేంద్రం అనుసరించిన వ్యూహాలేంటి? ఉద్దీపనకు చేపట్టాల్సిన చర్యలేంటి? ఆర్థిక రంగానికి ఊతమివ్వడానికి వ్యయాలు పెంచితే సరిపోతుందా? ఇలాంటి అంశాలపై ప్రముఖ పాత్రికేయురాలు పూజా మెహ్రా విశ్లేషణ మీకోసం ప్రత్యేకం.

Should the upcoming budget provide a fiscal stimulus to the economy?
ప్రతికూలతల మధ్య బడ్జెట్- కేంద్రం చేయాల్సిందేంటి?
author img

By

Published : Jan 14, 2020, 2:52 PM IST

Updated : Jan 14, 2020, 3:43 PM IST

ఫిబ్రవరి 1... కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన రెండో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ముహూర్తం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బడ్జెట్ ప్రభుత్వానికి చాలా కీలకమైంది. అందుకే ఈసారి బడ్జెట్ కసరత్తులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా భాగస్వామి అవుతున్నారు. దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు, వ్యాపారవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.

భారత్​ తీవ్రమైన ఆర్థిక మందగమనం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ ప్రభుత్వానికి కీలకంగా మారింది. 2019 జులై-సెప్టెంబర్​ త్రైమాసికంలో దేశ నామమాత్రపు జీడీపీ వృద్ధి రేటు 6.1 శాతానికి పడిపోయింది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ సిరీస్ ప్రవేశపెట్టిన తర్వాత వృద్ధి రేటు అతి తక్కువ నమోదవడం ఇదే ప్రథమం. ఈ నెల ప్రారంభంలో నామమాత్రపు జీడీపీ వృద్ధి గణాంకాలు వెలువరించింది కేంద్రం. ఈ గణాంకాల ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేవలం 7.5 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. గత కొన్ని దశాబ్దాలలో ఇదే అత్యల్పం.

ఆ ఆలోచన మారాల్సిందే

వృద్ధి మందగమనం విరుగుడు కోసం భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య విధానాలు సహా బడ్జెట్​లో ప్రభుత్వం ఉద్దీపన చర్యలు చేపడుతుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే మందగమనం నుంచి బయటపడేందుకు వ్యయం పెంచాలన్న ఆలోచనను ప్రభుత్వాలు వీడాలి. వ్యయాలు పెంచడం ద్వారానే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టొచ్చన్న భ్రమ నుంచి బయటకు రావాలి. దీన్ని నిరూపించడానికి చాలా మార్గాలు,కారణాలు ఉన్నాయి.

నిధులే లేవు

వ్యయాలను ఒక్కసారిగా పెంచడానికి ప్రస్తుతం ప్రభుత్వం వద్ద అధిక నిధులు లేవు. జీడీపీ వృద్ధి మందగిస్తే పన్నుల రాబడి కూడా తగ్గుతుంది.
ప్రభుత్వం ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న రూ.2 లక్షల కోట్ల పన్ను రాబడికి కొద్ది దూరంలో ఆగిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంప్ట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్(సీజీఏ) గణాంకాల ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో స్థూల పన్నుల రాబడి వృద్ధి రేటు పదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. 2009-10 తర్వాత ఇదే అత్యల్పం. కార్పొరేట్ పన్ను​ సంస్కరణల కోసం సంస్థల లాభాలపై పన్ను తగ్గించి ఇప్పటికే కేంద్రం తన ఆదాయాన్ని గణనీయంగా త్యాగం చేసింది.

పన్నేతర ఆదాయ పరిస్థితీ అంతే

ప్రభుత్వానికున్న మరో ఆదాయ వనరు... పన్నేతర ఆదాయం. రిజర్వు బ్యాంకు నుంచి ప్రభుత్వం తీసుకునే నిధులు ఇదివరకే లెక్కించారు. ఎయిర్​ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) వాటాల అమ్మకం ఈ ఏడాది పూర్తయ్యేలా కనిపించడం లేదు. దీంతో పన్ను ఆదాయాల్లో కొరత ఉన్న ఈ సందర్భంలో పన్నేతర ఆదాయాలు సర్దుబాటు చేసే అవకాశాలు లేనట్లే. 2019-20 సంవత్సరానికి నిర్దేశించుకున్న రూ.1,05,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యంలో 2019 సెప్టెంబర్ నాటికి కేవలం 16.53 శాతం పూర్తయినట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.

'మౌలికం'తో సమస్యలు ఇవే

ఆర్థిక రంగానికి ఊతమిచ్చేందుకు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పెద్ద ఎత్తున చేపట్టడం ఓ ప్రధాన అవకాశం. అయితే... ఈ ప్రాజెక్టులలో పెట్టుబడుల శాతాన్ని పెంచడం ఇప్పుటికిప్పుడే ఫలితాన్నివ్వదు. మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు దీర్ఘ కాలానికి సంబంధించిన విషయం. కానీ వృద్ధిని తక్షణమే పెంచాల్సిన అవసరం ఉంది.

ఆదాయ పన్నులో కోత!

వ్యయాలను పెంచడం ద్వారానే కాకుండా పన్నులు తగ్గించడం ద్వారా కూడా ప్రభుత్వం ఉద్దీపన చర్యలు చేపట్టవచ్చు. అయితే... భారత్​లో 5 శాతం మంది మాత్రమే ఆదాయ పన్ను కడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లు తగ్గించడం ద్వారా కొద్ది మందికి మాత్రమే ప్రయోజనం చేకూరుతుందన్న విషయం మరవకూడదు.

2019 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్​లో ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రయత్నాలు చేసింది. అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయెల్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్​లో 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వ్యక్తులను ఆదాయపు పన్ను నుంచి మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఫలితం... మందగమనమే

స్థిరాస్తి అమ్మకాలపై వచ్చే ఆదాయ మినహాయింపును రెండుకు పెంచడం సహా జీతార్జనపై స్టాండర్డ్​ డిడక్షన్​ను రూ.40,000 నుంచి రూ.50,000కు పెంచారు. బ్యాంక్​ అకౌంట్​ సేవింగ్స్​ ద్వారా వచ్చే వడ్డీపై పన్ను మినహాయింపును రూ.10,000 నుంచి రూ.50,000కు పెంచుతూ బడ్జెట్​లో నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి పన్ను ఉద్దీపన చర్యలు ప్రకటించినప్పటికీ 2019లో మందగమనం మరింత వేళ్లూనింది.

రుణాల సంగతేంటి?

ప్రభుత్వం ఆర్థిక సంస్థల నుంచి పెద్ద ఎత్తునే రుణాలు తీసుకొస్తుంది. తమ వద్ద ఉన్న డిపాజిట్లకు లోబడి బ్యాంకులు ప్రభుత్వం నుంచి రుణాలు కొనుగోలు చేస్తాయి. ఈ కారణంగా ప్రభుత్వ రుణాలు ఆర్థిక వ్యవస్థలోని పొదుపు చేసిన మొత్తానికి మించి ఉండవు.
ఇప్పటికే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పులన్నీ కలిపి జీడీపీలో 8-9 శాతానికి చేరుకున్నాయి. హౌస్​హోల్డ్ సేవింగ్స్ ప్రస్తుతం జీడీపీలో 6.6 శాతంగా ఉన్నాయి. ఇది ప్రభుత్వానికి రుణం ఇవ్వడానికి సరిపోదు. విదేశాల నుంచి ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులు జీడీపీలో దాదాపు 2.4 శాతంగా ఉన్నాయి. ఉద్యోగాల సృష్టి కొరవడడం సహా ఆదాయాలు పెరగకపోవడం వల్ల దేశంలో పొదుపు పెరగడం లేదు. ప్రభుత్వ రుణాలు భారీగా పెరిగితే రాబోయే రోజుల్లో విదేశీ రుణదాతలపై అతిగా ఆధారపడే పరిస్థితి వస్తుంది. అంతర్జాతీయంగా రూపాయి మారకం మారుతుంది కాబట్టి ఇందుకు చిక్కులు ఏర్పడతాయి. అమెరికా-ఇరాన్ వంటి ఉద్రిక్తతలు తలెత్తితే అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్నంటే పరిస్థితుల్లో మరిన్ని అవాంతరాలు తప్పవు.

చేయాల్సిందల్లా...

అందువల్ల ప్రస్తుత బడ్జెట్​లో ప్రభుత్వం చేయాల్సిందల్లా డిమాండ్ సంకోచం ఉద్భవించిన అసంఘటిత రంగంలో వ్యయాలు తగ్గకుండా చూసుకోవడమే. పీఎం-కిసాన్(ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి), మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకం వంటి వాటిలో ప్రభుత్వం అధికంగా ఖర్చు చేయవచ్చు. తద్వారా గ్రామీణుల ఆదాయాన్ని, వారి కొనుగోలు శక్తిని పెంచవచ్చు.

-పూజా మెహ్రా, పాత్రికేయురాలు, 'ద లాస్ట్ డికేడ్(2008-18)' పుస్తక రచయిత

Intro:The Supreme Court today took on record the compliance report filed by the state of Kerela on demolition of Maradu flats as per the apex court's earlier order. Though Justice Arun Mishra refused to dispose off the case now and has asked the state to remove the debris and restore the place and submit the report on it by 10th February when the next hearing will take place.

Body:The bench comprising of Justice Arun Mishra and Justice MR Shah have also asked the parties to the case to make an application of their requests and then argue the case. Today some flat owners told the bench that they wanted to approach the HC for the sum of money and wanted the state to take care of the court fees.

Last year the apex court had ordered the demolition of the Maradu flats as they violated the Coastal Regulation Zone rule. They were also asked by the court to pay a compensation of 25 lakhs to the flat owners.

Conclusion:Yesterday the last illegal settlement was also demolished.
Last Updated : Jan 14, 2020, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.