ETV Bharat / business

ఫార్చూన్​ జాబితాలో అడోబ్​, మాస్టర్​కార్డ్​ సీఈఓలు

అమెరికా ఫార్చూన్​ బిజినెస్​ పర్సన్​ ఆఫ్​ ది ఇయర్​-2020 జాబితాలో అడోబ్​, మాస్టర్​ కార్డు సీఈఓలు చోటు దక్కించుకున్నారు. శంతను నారాయణ్​ 8వ స్థానంలో, అజయ్ బంగా 9వ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది కూడా టెస్లా సీఈఓ ఎలన్​ మస్క్​ అగ్రస్థానం కైవసం చేసుకున్నారు.

Shantanu Narayen, Ajay Banga named among Fortune Businessperson of the Year 2020
ఫార్చూన్​ ఉత్తమ వ్యాపారవేత్తల్లో అడోబ్​, మాస్టర్​కార్డ్​ సీఈఓలు
author img

By

Published : Dec 5, 2020, 5:44 AM IST

ఫార్చూన్​ బిజినెస్​ పర్సన్​ ఆఫ్​ ది ఇయర్​ 2020 జాబితాలో భారత సంతతికి చెందిన అడోబ్​ సీఈఓ శంతను నారాయణ్​, మాస్టర్​ కార్డ్​ సీఈఓ అజయ్​ బంగా చోటు దక్కించుకున్నారు. టెస్లా సీఈఓ ఎలన్​ మస్క్​ మరోసారి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు. మస్క్ వరుసగా రెండోసారి ఈ​ జాబితాలో తొలిస్థానంలో నిలవడం గమనార్హం.

కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ ఇతర దిగ్గజ నాయకులు కూడా గణనీయ పనితీరు కనబరిచినట్లు ఫార్చూన్​ తెలిపింది. ఈ​ జాబితాలో ఎనిమిదో స్థానంలో శంతను నారాయణ్ ఉన్నారు. ఆయన సారథ్యంలో అడోబ్​ డిజైన్, పబ్లిషింగ్​ టూల్స్​ మరింత మందికి చేరువ కావడం కొనసాగిందని వెల్లడించింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ కంపెనీ మూడో త్రైమాసికంలో 14 శాతం వృద్ధితో 3.3 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది.

గత పదేళ్లుగా మాస్టర్​ కార్డ్ సీఈఓగా వ్యవహరిస్తున్న అజయ్​ బంగా.. ఫార్చూన్​ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచారు. త్వరలోనే ఆయన పదవి నుంచి వైదొలగనున్నారు. 2021 జనవరి 1 నుంచి కొత్త సీఈఓగా మైకేల్​ మైబాచ్​ పనిచేయనున్నారు.

జాబితాలోని మరింత మంది..

ఫార్చూన్​ 20 మంది జాబితాలో అడ్వాన్స్​డ్​ మైక్రో డివైసెస్​ సీఈఓ లిసా సూ రెండో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. నెట్​ఫ్లిక్స్​ సీఈఓ రీడ్ హ్యాస్టింగ్స్​(4), ఫోర్టిస్క్యూ మెటల్​ గ్రూప్​ సీఈఓ ఎలిజబెత్​ గైన్స్​(5), అమెజాన్​ సీఈఓ జెఫ్​ బెజోస్​(7), ఇంట్యూట్​ సీఈఓ ససాన్ గూడార్జి(16) గా నిలిచారు.

ఇదీ చూడండి:'ఆశించిన దాని కంటే వేగంగా వృద్ధి రేటు రికవరీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.