స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ, ఇంధన రంగాల్లో కొనుగోళ్లు జరుగుతుండగా, వాహన, బ్యాంకింగ్, లోహ, ఫార్మా రంగాలు ఒత్తిడిలో ఉన్నాయి. అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజిల్లోని చైనా కంపెనీలను ట్రంప్ ప్రభుత్వం డీలిస్ట్ చెయ్యొచ్చన్న ఊహాగానాలు.. ఆసియా మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 315 పాయింట్లు కోల్పోయి 38 వేల 505 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 95 పాయింట్లు నష్టపోయి 11 వేల 420 వద్ద ట్రేడవుతోంది.
లాభాల్లో
హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హీరో మోటోకార్ప్, ఐటీసీ రాణిస్తున్నాయి.
నష్టాల్లో
ఎస్ బ్యాంకు, జీ ఎంటర్టైన్ మెంట్, ఇండస్ఇండ్ బ్యాంకు, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, వేదాంత, సన్ ఫార్మా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ఆసియా మార్కెట్లు
ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిక్కీ, షాంఘై కాంపోజిట్ నష్టాల్లో ట్రేడవుతుండగా, హాంగ్‌సెంగ్, కోస్పీ లాభాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి విలువ
రూపాయి విలువ పెరిగి డాలరుకు రూ.70.46గా ఉంది.
ఇదీ చూడండి: సుఖమయ జీవనానికి తారకమంత్రం.. పొదుపు, పెట్టుబడి