ETV Bharat / business

సూచీలకు కరోనా భయాలు- సెన్సెక్స్​ 552 మైనస్

స్టాక్​మార్కెట్లు ఇవాళ్టి సెషన్​లో భారీ నష్టాల్లో ముగిశాయి. ప్రపంచ దేశాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు.. దేశీయ సూచీలపై తీవ్ర ప్రభావం చూపాయి. సెన్సెక్స్​ 550, నిఫ్టీ 150 పాయింట్లకుపైగా నష్టపోయాయి.

Sensex tanks 552 pts on second COVID wave fears
దేశీయ సూచీలను కమ్మేసిన కరోనా భయాలు
author img

By

Published : Jun 15, 2020, 4:51 PM IST

కరోనా భయాలతో స్టాక్​మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. వైరస్​ మళ్లీ విజృంభిస్తుండటం వల్ల ప్రపంచ మార్కెట్లు ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఇవే ప్రతికూల సంకేతాలు దేశీయ సూచీల నష్టానికీ కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 552 పాయింట్లు కోల్పోయి.. 33 వేల 229 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 857 పాయింట్లు పతనమైందీ సూచీ.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ.. 159 పాయింట్ల నష్టంతో 9 వేల 814 వద్ద సెషన్​ను ముగించింది.

ఫార్మా, పీఎస్​యూ బ్యాంకులు మినహా మిగతా రంగాలన్నీ భారీగా నష్టపోయాయి.

ఇండస్​ఇండ్​కు నష్టాలు.. రిలయన్స్​కు లాభాలు

సెన్సెక్స్​ ప్యాక్​లో ఇండస్​ఇండ్​ బ్యాంక్​ భారీగా నష్టపోయింది. దాదాపు 7 శాతం క్షీణించింది. యాక్సిస్ ​బ్యాంక్, బజాజ్​ ఫినాన్స్​, ఐసీఐసీఐ బ్యాంక్​, ఎన్టీపీసీ, టాటా స్టీల్​, ఐటీసీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు నష్టపోయిన కంపెనీల జాబితాలో ఉన్నాయి.

రిలయన్స్​ ఇండస్ట్రీస్​, హెచ్​సీఎల్​ టెక్​, సన్​ ఫార్మా, ఓఎన్​జీసీ రాణించాయి.

చైనా, అమెరికాల్లో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్న​ నేపథ్యంలో.. ఆర్థిక వ్యవస్థపై మదుపరులకు భయాందోళనలు నెలకొన్నాయి. ఇదే వారి సెంటిమెంట్​ను దెబ్బతీసినట్లు విశ్లేషకులు అంటున్నారు.

అక్కడా కరోనా భయాలే..

షాంఘై, హాంకాంగ్​, టోక్యో, సియోల్​ సూచీలు 4 శాతానికిపైగా నష్టాలను నమోదుచేశాయి. ఐరోపా మార్కెట్లూ నష్టాల్లో ట్రేడయ్యాయి.

ముడిచమురు ధరల సూచీ బ్రెంట్​.. 0.93 శాతం క్షీణించి బ్యారెల్​కు 38.37 డాలర్లకు చేరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.