ETV Bharat / business

11 ఏళ్లకు రికార్డు లాభాలు నమోదుచేసిన సెన్సెక్స్​ - corona latest news

దేశీయ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలను నమోదుచేశాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలకు తోడు.. దేశీయంగా కొనుగోళ్లు జరగడం మార్కెట్లలో జోష్​ నింపింది. సెన్సెక్స్​ 30 వేల మార్కును అధిగమించగా.. నిఫ్టీ 700 పాయింట్లకుపైగా లాభపడింది. 2009 మే తర్వాత సెన్సెక్స్​ రికార్డు లాభాల్లో ముగియడం ఇదే తొలిసారి.

.Sensex soars 2,476.26 points to end at 30,067.21; Nifty rallies 708.40 points to 8,792.20.
దేశీయ సూచీలకు భారీ లాభాలు
author img

By

Published : Apr 7, 2020, 3:56 PM IST

Updated : Apr 7, 2020, 4:54 PM IST

స్టాక్​మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్​, ఐటీ రంగాల్లో కొనుగోళ్లు దేశీయ సూచీలకు ఊతమిచ్చాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​.. ఏకంగా 2 వేల 476(8.97 శాతం) పాయింట్లు పెరిగింది. శాతం పరంగా ఒక సెషన్​లో సెన్సెక్స్​ ఇంతలా వృద్ధి నమోదుచేయడం 2009 మే తర్వాత తొలిసారి కావడం విశేషం.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ కూడా భారీగా లాభపడింది. 702 పాయింట్ల(8.76 శాతం) లాభంతో 8 వేల 786 వద్ద సెషన్​ను ముగించింది. నిప్టీ ట్రేడింగ్​లో ఇదే ఉత్తమ సెషన్​గా రికార్డు సృష్టించింది.

మొత్తం 1813 షేర్లు లాభపడ్డాయి. 535 షేర్లు క్షీణించాయి. మరో 189 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.

భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్రం మరో ప్యాకేజీ ప్రకటించనుందన్న సంకేతాల నేపథ్యంలో ఇంట్రాడేలో సూచీలు దూసుకెళ్లాయి.

లాభనష్టాల్లో..

సెన్సెక్స్​ ప్యాక్​లో అన్నీ లాభాలను గడించాయి. 22 శాతం లాభాలతో ఇండస్​ఇండ్​ బ్యాంక్ ఉత్తమ గెయినర్​గా నిలిచింది. యాక్సిస్​ బ్యాంక్​, హిందాల్కో, ఎం అండ్​ ఎం, హీరో మోటోకార్ప్​, మారుతీ సుజుకీ, గ్రేసిమ్​ ఇవాళ్టి ట్రేడింగ్​లో లాభాలను నమోదుచేశాయి. ఫార్మా రంగం పుంజుకుంది.

ప్రపంచ మార్కెట్లు..

షాంఘై, హాంగ్​కాంగ్​, టోక్యో, సియోల్​ సూచీలు 2 శాతం మేర పెరిగాయి. ఐరోపా మార్కెట్లూ లాభాల్లోనే కొనసాగాయి.

ముడిచమురు ధరలు 2.48 శాతం పెరిగి.. బ్యారెల్​కు 33. 87గా ఉంది.

రూపాయి...

దాదాపు 55 పైసలు పుంజుకున్నరూపాయి... డాలర్​తో పోలిస్తే 75.63 వద్ద స్థిరపడింది.

Last Updated : Apr 7, 2020, 4:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.