స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ భారీ నష్టాలతో ముగిశాయి. బుధవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ ఏకంగా 938 పాయింట్లు తగ్గి 47,409 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ- నిఫ్టీ 271 పాయింట్లు కోల్పోయి 13,967 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 14 వేల మార్క్‌ను కోల్పోవడం జనవరి 4 తర్వాత ఇదే ప్రథమం. కరోనా సంక్షోభం అనంతరం ఇటీవలి నెలల్లో సూచీలు ఈ స్థాయి నష్టాలను మూటగట్టుకోవడం కూడా ఇదే తొలిసారి.
గురువారంతో జనవరి నెల డెరివేటివ్స్ గడువు ముగియినున్న నేపథ్యంలో భారీగా అమ్మకాలు నమోదయ్యాయి. దీనికి తోడు బ్యాంకింగ్, లోహ రంగాలు భారీగా క్షీణించడం, హెవీ వెయిట్ షేర్లు కుదేలవ్వడం వంటివి గురువారం నష్టాలకు కారణమైనట్లు విశ్లేషకులు చెబుతున్నారు. త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై అంచనాలు కూడా నష్టాలకు కారణమంటున్నారు.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 48,387 పాయింట్ల అత్యధిక స్థాయి, 47,269 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 14,237 పాయింట్ల గరిష్ఠ స్థాయి 13,929 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
టెక్ మహీంద్రా, ఐటీసీ, హెచ్‌సీఎల్‌టెక్, పవర్‌గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే షేర్లు లాభాలను గడించాయి.
టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎం&ఎం, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, షేర్లు భారీగా నష్టాపోయాయి.
ఇదీ చూడండి:భారత్‌లో కార్యకలాపాలకు 'టిక్‌టాక్' గుడ్‌బై