స్టాక్ మార్కెట్లు (Stock Market) గురువారం లాభాలు గడించాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 488 పాయింట్లు పెరిగి 59,678 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 144 పాయింట్ల లాభంతో 17,790 వద్దకు చేరింది.
ఆరంభం నుంచి సూచీలు దూకుడు ప్రదర్శించాయి. సెషన్ ఆరంభంలో అన్ని రంగాలు సానుకూలంగా స్పందించాయి. మిడ్ సెషన్ తర్వాత బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 59,914 పాయింట్ల అత్యధిక స్థాయి, 59,597 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 17,857 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 17,763 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
టైటాన్ షేర్లు రికార్డు సృష్టించాయి. ఒక్క రోజులో 10 శాతానికిపైగా పుంజుకున్నాయి. దీనితో షేరు విలువ జీవవకాల గరిష్ఠాన్ని తాకింది. మార్కెట్ క్యాపిటల్ రూ.2 లక్షల కోట్లు దాటింది.
ఎం&ఎం, మారుతీ సుజుకీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా లాభాలను గడించాయి.
డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్‌యూఎల్, నెస్లే ఇండియా నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. నిక్కీ (జపాన్), కోస్పీ (దక్షిణ కొరియా), హాంగ్‌సెంగ్ (హాంకాంగ్) సూచీలు లాభాలను గడించాయి. షాంఘై (చైనా) సూచీ సెలవులో ఉంది.
ఇదీ చదవండి: కన్వినెన్స్ స్టోర్ల వ్యాపారాల్లోకి రిలయన్స్ రిటైల్