ETV Bharat / business

ఐటీ షేర్ల అండతో స్టాక్ మార్కెట్లకు లాభాలు - సెన్సెక్స్

ఆరంభంలో ఒడుదొడుకులు ఎదుర్కొన్నా.. మంగళవారం సెషన్​ను స్వల్ప లాభాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 113 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ స్వల్పంగా 24 పాయింట్లు పుంజుకుంది.

STOCKS CLOSING TODAY
స్టాక్ మార్కెట్లకు లాభాలు
author img

By

Published : Oct 20, 2020, 3:51 PM IST

Updated : Oct 20, 2020, 4:19 PM IST

స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 113 పాయింట్లు బలపడి.. 40,544 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 24 పాయింట్ల వృద్ధితో 11,897 వద్దకు చేరింది.

అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, దేశీయంగా మదుపరుల అప్రమత్తతల నడుమ సూచీలు ఆరంభంలో కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. అయితే ఐటీ షేర్లు రాణించడం వల్ల మార్కెట్లు సానుకూలంగా ముగియటం గమనార్హం.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 40,732 పాయింట్ల అత్యధిక స్థాయి, 40,305 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 11,924 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 11,837 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

హెచ్​సీఎల్​టెక్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్​టెల్, హెచ్​డీఎఫ్​సీ షేర్లు లాభాలను నమోదు చేశాయి.

ఓఎన్​జీసీ, పవర్​గ్రిడ్​, ఎన్​టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, సియోల్, హాంకాంగ్ సూచీలు లాభాలను గడించాయి. టోక్యో సూచీ మాత్రం నష్టాలను మూటగట్టుకుంది.

రూపాయి, ముడి చమురు..

కరెన్సీ మార్కెట్లో రూపాయి మంగళవారం 12 పైసలు తగ్గింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ 73.49 వద్ద స్థిరపడింది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.42 శాతం పడిపోయింది. బ్యారెల్ ముడి చమురు ధర 42.44 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:సరళ్​ జీవన్ బీమా ఫీచర్లు, నిబంధనలు తెలుసా?

Last Updated : Oct 20, 2020, 4:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.