ETV Bharat / business

మార్కెట్లలో జోష్​.. సెన్సెక్స్​ 500 పాయింట్లు ప్లస్​ - అంతర్జాతీయ సానుకూల సంకేతాలు

Sensex rallies 608.59 pts to 34,895.83 in opening session
మార్కెట్లలో జోష్​.. సెన్సెక్స్​ 500 పాయింట్లు ప్లస్​
author img

By

Published : Jun 8, 2020, 9:33 AM IST

Updated : Jun 8, 2020, 10:17 AM IST

10:03 June 08

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, విదేశీ నిధుల ప్రవాహం కారణంగా దేశీయ స్టాక్​ మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ ఆరంభంలో 600 పాయింట్లకుపైగా మెరుగుపడింది. ప్రస్తుతం 424 పాయింట్ల లాభంతో 34 వేల 711 వద్ద ట్రేడవుతోంది. 

జాతీయ స్టాక్​ ఎక్స్సేంజి సూచీ నిఫ్టీ ఆరంభ ట్రేడింగ్​లో 10 వేల 300 మార్కును అధిగమించింది. ప్రస్తుతం 132 పాయింట్లు పెరిగి.. 10 వేల 274 వద్ద ఉంది. 

రిలయన్స్​ ఇండస్ట్రీస్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​లలో భారీ లాభాలూ మార్కెట్లలో జోష్​ నింపుతున్నాయి. 

లాభనష్టాల్లోనివివే...

ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఐఓసీ, బీపీసీఎల్​, యాక్సిస్​ బ్యాంక్​, బజాజ్​ ఫినాన్స్​ పుంజుకున్నాయి. 

భారతీ ఇన్​ఫ్రాటెల్​, డా.రెడ్డీస్​ ల్యాబ్స్​, సిప్లా, శ్రీ సిమెంట్స్​, జీ ఎంటర్​టైన్​ మెంట్స్​ డీలాపడ్డాయి.

కరోనా లాక్​డౌన్​ ఆంక్షలు సడలిస్తున్నకారణంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్న ఆశలతో ఆసియా మార్కెట్లు లాభాలు నమోదుచేస్తున్నాయి. షాంఘై, హాంకాంగ్​, సియోల్​, టోక్యో సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

బ్యారెల్ ముడిచమురు ధర 1.47 శాతం పెరిగి 42.92 డాలర్లుగా ఉంది.

09:28 June 08

భారీ లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో స్టాక్​మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ ఆరంభ ట్రేడింగ్​లోనే 500 పాయింట్లు మెరుగుపడింది. ప్రస్తుతం 568 పాయింట్ల లాభంతో 34 వేల 856 వద్ద ఉంది. 

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 169 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 10 వేల 311 వద్ద కొనసాగుతోంది. 

Last Updated : Jun 8, 2020, 10:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.