ETV Bharat / business

ఫెడ్ దెబ్బతో మదుపర్ల అప్రమత్తత.. స్టాక్ మార్కెట్లు కుదేలు - స్టాక్​ మార్కెట్లపై కరోనా ప్రభావం

విదేశీ మదుపరుల అప్రమత్తతో స్టాక్​ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 709 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 214 పాయింట్ల నష్టంతో 10 వేల మార్క్​ను కోల్పోయింది. ఎస్​బీఐ షేర్లు గురువారం సెషన్​లో అత్యధిక నష్టాన్ని మూటగట్టుకున్నాయి.

stocks today
స్టాక్ మార్కెట్​ వార్తులు
author img

By

Published : Jun 11, 2020, 3:51 PM IST

స్టాక్ మార్కెట్లకు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. బొంబయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 709 పాయింట్లు కోల్పోయి.. 33,538 వద్దకు చేరింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 214 పాయింట్ల నష్టంతో 9,902 వద్ద స్థిరపడింది. ఆరంభం నుంచే ఒడుదుకులు ఎదుర్కొన్న సూచీలు ఆ తర్వాత ఏ దశలోనూ కొలుకోలేదు.

అమెరికా జీడీపీ ఈ ఏడాది 6.5 శాతం మేర క్షీణిస్తుందని.. ఫెడ్ ఇటీవల అంచనాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో విదేశీ మదుపరులు అప్రమత్తత పాటించి అమ్మకాలకు మొగ్గుచూపారు. వీటికి తోడు ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లన్నీ నష్టాలను నమోదు చేయడం దేశీయ మదుపరుల్లో ప్రతికూలతలు పెంచింది. ఈ పరిణామాలన్నీ గురువారం నష్టాలకు కారణమయ్యాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 34,219 పాయింట్ల అత్యధిక స్థాయి, 33,480 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 10,112 పాయింట్ల గరిష్ఠ స్థాయి.., 9,899 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఇండస్​ఇండ్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, పవర్​ గ్రిడ్, ఎం&ఎం, నెస్లే మాత్రమే 30 షేర్ల ఇండెక్స్​లో లాభపడ్డాయి.

ఎస్​బీఐ అత్యధికంగా 5 శాతానికిపైగా నష్టపోయింది. సన్​ఫార్మా, మారుతీ, బజాజ్ ఫినాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్​లు ప్రధానంగా నష్టాల్లో ఉన్నాయి.

రూపాయి..

కరెన్సీ మార్కెట్​లో రూపాయి బుధవారం 20 పైసలు తగ్గింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ రూ.75.79 వద్ద స్థిరపడింది.

ఇదీ చూడండి:ఎంఎస్​ఎంఈలకు 9 రోజుల్లో రూ.12,201 కోట్ల రుణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.