స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల్లో ట్రేడవుతున్నాయి. బ్యాంకింగ్, ఇంధనం, ఐటీ రంగాలు సానుకూలంగా స్పందిస్తుండటం కలిసివస్తోంది.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 190 పాయింట్లకుపైగా వృద్ధితో 31,572 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 70 పాయింట్లకు పైగా లాభంతో 9,260 వద్ద కొనసాగుతోంది.
సూచీలు సానుకూలంగా స్పందిస్తున్నప్పటికీ కరోనా నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నారని స్టాక్ బ్రోకర్లు చెబుతున్నారు.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఓఎన్‌జీసీ, టాటా స్టీల్, టీసీఎస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్&టీ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
టైటాన్, ఎం&ఎం, మారుతీ, బజాజ్ ఫినాన్స్, పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 3.16 శాతం వృద్ధి చెందింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 21.02 వద్దకు చేరింది.
ఇతర మార్కెట్లు
షాంఘై మినహా ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లు (హాంకాంగ్, సియోల్, జపాన్) లాభాలతో సెషన్ ప్రారంభించాయి.