దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ద్రవ్యోల్బణం 5 ఏళ్ల గరిష్ఠానికి(7.35 శాతానికి) చేరుకున్న నేపథ్యంలో మదుపరుల సెంటిమెంట్ దెబ్బతినడమే ఇందుకు కారణం. కూరగాయలు, ఉల్లిపాయల ధరలు పెరగడం ఇందుకు తోడైంది.
ద్రవ్యోల్బణం వల్ల ఆర్బీఐ తన కీలక వడ్డీరేట్లను తగ్గించే అవకాశం తగ్గుతుందని, ఇప్పటికే మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఇది మరింత ఇబ్బందికరంగా పరిణమిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 58 పాయింట్లు కోల్పోయి 41 వేల 801 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 8 పాయింట్లు నష్టపోయి 12 వేల 320 వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాల్లో
టాటా స్టీల్, బీపీసీఎల్, హెచ్‌సీఎల్ టెక్, ఎమ్ అండ్ ఎమ్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, వేదాంత, గెయిల్, జేఎస్‌డబ్ల్యూ రాణిస్తున్నాయి.
ఎస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఓఎన్జీసీ, ఆల్ట్రాటెక్ సిమెంట్ నేలచూపులు చూస్తున్నాయి.
ఆసియా మార్కెట్లు
ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిక్కీ, కోస్పీ లాభాల్లో ట్రేడవుతుండగా, హాంగ్‌సెంగ్, షాంగై కాంపోజిట్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి విలువ
రూపాయి విలువ 4 పైసలు పెరిగి, ఒక డాలరుకు రూ.70.82గా ఉంది.
ముడిచమురు ధర
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 0.17 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 64.31 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: సీఎండీ పదవీ విభజన గడువు రెండేళ్లు పొడిగింపు: సెబీ