స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్, ఐటీ రంగాల్లోని ప్రధాన షేర్లు నేటి లాభాలకు దన్నుగా నిలిచాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 483పాయింట్లు బలపడి 31,863 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 127 పాయింట్లు పెరిగి 9,314 వద్ద ముగిసింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 31,959 పాయింట్ల అత్యధిక స్థాయి 31,292 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 9,344 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 9,170 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
కోటక్ మహింద్రా బ్యాంక్ నేడు అత్యధికంగా 8 శాతానికిపైగా లాభపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్‌టెక్, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాలను గడించాయి. వొడాఫోన్ ఐడియా షేర్లు కూడా నేడు భారీగా పుంజుకున్నాయి.
టైటాన్, హెచ్‌యూఎల్, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, నెస్లే షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.