ETV Bharat / business

అంతర్జాతీయ సానుకూలతలతో స్టాక్ మార్కెట్లకు లాభాలు - నిఫ్టీ టుడే

అంతర్జాతీయ సానుకూలతలతో స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 61 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 18 పాయింట్లు పుంజుకుంది.

STOCK MARKETS TODAY
నేటి స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Mar 5, 2020, 3:55 PM IST

Updated : Mar 5, 2020, 7:06 PM IST

స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్​ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా చర్యలు ముమ్మరమైన నేపథ్యంలో మదుపరులు కొనుగోళ్లపై దృష్టి సారించారు.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ-సెన్సెక్స్ 61 పాయింట్ల లాభంతో 38,471 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ-నిఫ్టీ 18 పాయింట్ల వృద్ధితో.. 11,269 వద్ద ముగిసింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 38,888 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 38,387 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.

నిఫ్టీ నేడు 11,389 పాయింట్ల అత్యధిక స్థాయి, 11,245 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివివే..

కోటక్ మహీంద్రా బ్యాంకు 2.74 శాతం, హెచ్​సీఎల్​టెక్​ 2.54 శాతం, భారతీ ఎయిర్​టెల్​ 2.03, టీసీఎస్ 2 శాతం వృద్ధి చెందాయి.

ఎస్ బ్యాంక్ షేర్లు ఏకంగా 26 శాతం ఎగిసింది. ఇందులో ఎస్​బీఐ వాటా కొనుగోలు చేయొచ్చనే వార్తలు లాభాలకు కారణం.

టెక్​ మహీంద్రా 2.28 శాతం, రిలయన్స్​ 2.06 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్​ 0.74 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.66 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇదీ చూడండి:ఈపీఎఫ్ చందాదారులకు షాక్.. డిపాజిట్లపై వడ్డీ రేటు తగ్గింపు

Last Updated : Mar 5, 2020, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.