ETV Bharat / business

ఇల్లెక్కిన స్కార్పియో.. మహీంద్రా ఫిదా - business news latest

బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి తన ఇంటిపైన అచ్చం స్కార్పియో ఆకారంలో నీటి ట్యాంకును కట్టుకున్నాడు. ఆ కారు మీద తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఈ ఫొటో నెట్టింట వైరల్‌ అయ్యింది. ఈ పోస్టు కాస్తా మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రాను చేరింది. ఓ ట్విట్టర్‌ యూజర్‌ పెట్టిన స్కార్పియో వాటర్‌ ట్యాంక్‌ ఫొటోకు స్పందించిన ఆయన.. ఈ ఆలోచనకు ఫిదా అయ్యారు.

Scorpio-water-tank-on-roof-top-Anand-mahindra-praises
ఇల్లెక్కిన స్కార్పియో.. మహీంద్రా ఫిదా
author img

By

Published : Oct 31, 2020, 4:18 PM IST

సొంత సంపాదనతో లేదా తొలిసారిగా కొనుక్కున్న వస్తువులపై ఎంతో మమకారం చూపిస్తాం. దాన్ని అపురూపంగా చూసుకుంటాం. అది సహజమే. బిహార్‌కు చెందిన ఇంతజార్‌ ఆలమ్‌కు తన తొలి కారు స్కార్పియో అంటే చాలా ఇష్టం. ఎంతగా అంటే.. ఏకంగా తన ఇంటిపైన అచ్చం స్కార్పియో ఆకారంలో నీటి ట్యాంకును కట్టుకుని.. కారు మీద తనకున్న ప్రేమను చాటుకున్నాడు.

భగల్‌పూర్‌కు చెందిన ఇంతజార్‌ ఇటీవల తాను కూడబెట్టుకున్న డబ్బుతో ఒక స్కార్పియో కొనుగోలు చేశాడు. అది తన తొలి కారు అవడంతో చాలా అపురూపంగా చూసుకున్నాడు. కారు కొన్నందుకు గుర్తుగా ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకున్నాడు. భార్య సలహాతో తన ఇంటి పైకప్పుపై అచ్చంగా స్కార్పియో ఆకారంలో నీటి ట్యాంక్‌ను నిర్మించుకున్నాడు. ఇందుకోసం ఆగ్రా నుంచి కూలీలను తెప్పించి దాదాపు రూ. 2.5లక్షల వరకు ఖర్చు చేశాడు. పూర్తిగా స్కార్పియో ఆకారంలో ఉన్న ఈ ట్యాంక్‌కు తన కారు నంబర్లతో నంబరు ప్లేట్ కూడా పెట్టించాడు.

దీన్ని చూసిన వారంతా ‘అరెరె.. స్కార్పియో ఇల్లెక్కిందే’ అనకుండా ఉండరు అన్నట్లుగా ఉంది. ఇంకేముంది ఇంతజార్‌ ఇంటి ఫొటో నెట్టింట వైరల్‌ అయ్యింది. ఈ పోస్టు కాస్తా మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రాను చేరింది. ఓ ట్విటర్‌ యూజర్‌ పెట్టిన స్కార్పియో వాటర్‌ ట్యాంక్‌ ఫొటోకు స్పందించిన ఆనంద్‌ మహీంద్రా ఇంతజార్‌ ఆలోచనకు ఫిదా అయ్యారు. ‘ఎదగడం అంటే ఇదే.. స్కార్పియో ఇంటి పైకప్పు వరకు ఎదిగింది. దీని యజమానికి నా సలామ్‌. తన తొలి కారుపై అతడికున్న అభిమానానికి సెల్యూట్‌’ అంటూ ఇంతజార్‌ను ప్రశంసించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.