SpiceJet financial issues: స్విట్జర్లాండ్‌కు చెందిన క్రెడిట్ సూయిజ్ సంస్థతో ఏర్పడిన ఆర్థిక వివాదాన్ని పరిష్కరించుకునేందుకు స్పైస్‌జెట్‌కు సుప్రీంకోర్టు మూడు వారాల గడువు ఇచ్చింది. ఈ క్రమంలో స్పైస్‌జెట్ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలంటూ లిక్విడేటర్‌కు మద్రాస్ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై స్టే విధించింది. అలాగే కార్యకలాపాలు నిలిపివేసి, ఆస్తులను టేకోవర్ చేసుకోవాలని లిక్విడేటర్‌కు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల విషయంలో తమ ప్రణాళికలు ఏంటని స్పైస్‌జెట్‌ను జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది.
స్పైస్‌జెట్ కార్యకలాపాలు నిలిపివేసి, ఆస్తులను టేకోవర్ చేసుకోవాలని లిక్విడేటర్‌కు మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన ఆదేశాలను, ఈ నెల 11న హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించడంతో స్పైస్‌జెట్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 2011లో కుదుర్చుకున్న ఒప్పందం కింద స్విట్జర్లాండ్‌కు చెందిన ఎస్‌ఆర్‌టీ టెక్నిక్స్ నుంచి విమానాల నిర్వహణ, మరమ్మతు, ఓవరాలింగ్ సేవలను పదేళ్ల పాటు స్పైస్‌జెట్ పొందింది. ఈ లావాదేవీల్లో స్పైస్‌జెట్ 24 మిలియన్ డాలర్ల (సుమారు రూ.180 కోట్ల) బకాయి పడిందంటూ ఎస్‌ఆర్‌టీ తరఫున క్రెడిట్ సూయిజ్ కోర్టును ఆశ్రయించింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: Union Budget 2022: బడ్జెట్లో 'ఎలక్ట్రిక్'కు మరింత కిక్!