ETV Bharat / business

Recruitments: 50 లక్షల కొత్త నియామకాలు! - ఈ ఏడాది కొత్త నియామకాలు

ఈ ఆర్థిక ఏడాదిలో నూతన ఉద్యోగ నియామకాలు(Recruitments) ఊపందుకుంటున్నాయని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు వెల్లడించారు. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ), కొత్త పింఛను పథకాలలో(ఎన్‌పీఎస్‌) కొత్త చేరికలు తమ ఆశావహ దృక్పథాన్ని బలపరుస్తున్నాయంటున్నారు. 2020-21లో కొత్తగా 44 లక్షల నియామకాలు జరుగుతాయని ఎస్‌బీఐ నివేదిక(SBI Report) తెలిపింది.

sbi report on new jobs
ఈ ఏడాది కొత్త నియామకాలు
author img

By

Published : Sep 4, 2021, 11:03 AM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగ విపణిలో కార్యకలాపాలు (Recruitments) పుంజుకోనున్నాయని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు చెబుతున్నారు. కరోనా ఉద్ధృతిలోనూ కంపెనీలు నియామక ప్రణాళికలను కొనసాగిస్తుండడం ఇందుకు దోహదం చేస్తుందని వారు తెలిపారు. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ), కొత్త పింఛను పథకాల్లో (ఎన్‌పీఎస్‌) కొత్త చేరికలు తమ ఆశావహ దృక్పథాన్ని బలపరుస్తున్నాయంటున్నారు. 'కరోనా రెండో దశ అనంతరం ఆర్థిక వ్యవస్థ తిరిగి సాధారణ స్థాయికి వచ్చే క్రమంలో నిరుద్యోగం ఎక్కువవుతోందని, కార్మిక కార్యకలాపాల్లో తగ్గుదల కనిపిస్తోందన్న' ఆందోళనల మధ్య ఈ అంచనాలు ఊరటనిస్తున్నాయి. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ(సీఎమ్‌ఐఈ) అంచనా ప్రకారం.. ఆగస్టులో 15 లక్షల మంది ఉద్యోగాలు పోయాయి. ఇందులో 13 లక్షలు గ్రామీణ ప్రాంతంలోనివే కావడం గమనార్హం.

తొలి ఉద్యోగాలు 50 శాతం: మొత్తం ఉద్యోగాల్లో కొత్త లేదా తొలి ఉద్యోగాల నిష్పత్తి 50 శాతంగా ఉంది. అంటే ప్రతి రెండు ఉద్యోగాల్లో ఒకటి కొత్తదని ఎస్‌బీఐ ఆర్థికవేత్త సౌమ్యకాంతి ఘోష్‌ అంటున్నారు. 2020-21తో పోలిస్తే ఇది 47 శాతం ఎక్కువని తెలిపారు. జూన్‌ త్రైమాసికంలో భారత్‌లో 30.74 లక్షల నియామకాలు జరిగాయి. ఇందులో 16.3 లక్షల ఉద్యోగాలు కొత్తవి. కొత్త నియామకాలు ఈ స్థాయిలో పెరిగితే 2021-22లో మొత్తం నియామకాలు 50 లక్షల మార్కును అధిగమించొచ్చు. 2020-21లో ఇవి 44 లక్షలుగా ఉన్నాయని ఎస్‌బీఐ నివేదిక తెలిపింది. ఏప్రిల్‌-జూన్‌లో ఈపీఎఫ్‌ నికర వినియోగదార్లు పెరగడం చూస్తుంటే కరోనా రెండో దశ వల్ల కార్మిక మార్కెట్‌పై ప్రభావం తక్కువగానే ఉన్నట్లు లెక్క అని వివరించింది.

ఇదీ చదవండి:సామాజిక మాధ్యమాలు- పుక్కిటి పురాణాల కార్ఖానాలు

హైకోర్టులకు 68 మంది జడ్జిలను సిఫారసు చేసిన కొలీజియం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.