కొవిడ్-19 చికిత్స కోసం రుణం కావాలనుకునే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కవచ్(SBI Kavach) పేరుతో వ్యక్తిగత రుణ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. గరిష్ఠంగా రూ.5లక్షల వరకు ఎలాంటి హామీ అవసరం లేని రుణాన్ని ఇస్తోంది. దీనికి 8.5శాతం వడ్డీగా నిర్ణయించింది.
వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యుల చికిత్స ఖర్చుకు ఈ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చని ఎస్‌బీఐ తెలిపింది. ఈ రుణానికి 60 నెలల వ్యవధి ఉంటుందని, ఇందులోనే మూడు నెలల మారటోరియం ఇస్తున్నట్లు ఎస్‌బీఐ ఛైర్మన్ దినేశ్ ఖారా తెలిపారు.
ఇదీ చదవండి:ఆధార్‌తో పాన్ కార్డు లింక్ చేశారా..?