ETV Bharat / business

ఛార్జీల పేరిట ఎస్​బీఐ రూ.300 కోట్లు వసూలు - ఎస్​బీఐ వసూళ్లపై ఐఐటీ బాంబే

కొన్ని రకాల సేవలపై బ్యాంకులు.. జీరో బ్యాలెన్స్ ఖాతాదారులపై అదనపు ఛార్జీలు విధిస్తున్నాయి. ఈ విధంగా ఐదేళ్లలో ఎస్​బీఐ రూ. 300 కోట్లు వసూలు చేసినట్లు ఐఐటీ బాంబే సర్వేలో తేలింది.

sbi, iit bombay
'పేరుకే జీరో బ్యాలెన్స్ ఖాతాలు'
author img

By

Published : Apr 12, 2021, 5:50 AM IST

Updated : Apr 12, 2021, 6:48 AM IST

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్​బీఐ) సహా పలు బ్యాంకులు నగదు నిల్వ అవసరం లేని(జీరో బ్యాలెన్స్) ఖాతాలు తెరుస్తూనే, వివిధ సేవల పేరిట ఆయా ఖాతా దార్ల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయని ఐఐటీ-బాంబే నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఎస్​బీఐ జీరో బ్యాలెన్స్ లేదా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులు(బీఎస్​బీడీఏ) ఒక నెలలో నాలుగు లావాదేవీలు నిర్వహించాక, తదుపరి ప్రతి నగదు ఉపసంహరణకు వారి నుంచి బ్యాంక్ రూ. 17.70 చొప్పున వసూలు చేస్తున్నట్లు అధ్యయనం పేర్కొంది.

సుమారు 12 కోట్ల మంది బీఎస్​బీడీఏ ఖాతాదారుల నుంచి 2015-20 మధ్య ఎస్​బీఐ ఛార్జీల రూపేణ రూ.300 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడైంది. 2018-19లో రూ. 72 కోట్లు, 2019-20లో రూ.158 కోట్లు ఇలా వసూలు చేసినట్లు ఐఐటీ బాంబే ప్రొఫెసర్ అశిష్ దాస్ వెల్లడించారు.

  • బీఎస్​బీడీఏ ఖాతాదారుల లావాదేవీలు ఒక నెలలో 4 దాటాక, నెఫ్ట్, ఐఎంపీఎస్, యూపీఐ, భీమ్-యూపీఐ, డెబిట్ కార్డు లావాదేవీలు నిర్వహించినా ఒక్కో దానిపై రూ.17.70 ఛార్జీ విధించడం చాలా ఎక్కువని అధ్యయనం తెలిపింది.
  • 2020 జనవరి నుంచి ఎస్​బీఐ యూపీఐ/భీమ్-యూపీఐ, రూపే-డిజిటల్ లావాదేవీలపై సేవా ఛార్జీలను విధించడం లేదు. మిగతా డెబిట్ లావాదేవీలకు రూ.17.70 చొప్పున ఛార్జీ విధిస్తోంది.
  • దేశంలో రెండో అతిపెద్ద బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్​బీ) కూడా ఇలాంటి 3.9 కోట్ల ఖాతాల నుంచి రూ. 9.9 కోట్లను ఇదే కాలంలో వసూలు చేసింది.

ఇదీ చదవండి:ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువులు ఇవే!

Last Updated : Apr 12, 2021, 6:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.