ETV Bharat / business

ఎస్​బీఐ కార్డు ఐపీఓ రేపే ప్రారంభం.. విశేషాలివే

ఎస్​బీఐ కార్డు ఐపీఓ సబ్​స్క్రిప్షన్​ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఎస్​బీఐ కార్డ్ అండ్ పేమెంట్ సర్వీస్​... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అనుబంధ సంస్థగా పనిచేస్తోంది. తాజా ఐపీఓ ద్వారా సుమారు రూ.10,000 కోట్లకు పైగా సమీకరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

SBI Cards IPO
ఎస్​బీఐ కార్డు ఐపీఓ రేపే ప్రారంభం
author img

By

Published : Mar 1, 2020, 6:42 PM IST

Updated : Mar 3, 2020, 2:06 AM IST

ఎస్​బీఐ కార్డు ఐపీఓ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ ఐపీఓ ద్వారా దాదాపు రూ.10,000 కోట్లకు పైగా సమీకరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు ఎస్​బీఐ కార్డ్ అండ్ పేమెంట్ సర్వీస్​... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అనుబంధ సంస్థగా పనిచేస్తోంది.

ఎస్​బీఐ కార్డు ఐపీవో విశేషాలు

  • ఐపీఓ ప్రారంభం: మార్చి 2
  • ఐపీఓ ముగింపు: మార్చి 5
  • ఐపీఓ ధర: రూ.750 - రూ.755 మధ్య ఉండొచ్చు.
  • ఐపీఓ ముగిశాక మే 16న షేర్లు మార్కెట్​లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.

లాట్ పరిమాణం- లిస్టింగ్ వివరాలు

  • ఈ బిడ్​లో 19 షేర్లను ఒక లాట్​గా నిర్ణయించారు.
  • మీకు ఎన్ని లాట్లు కావాలో నిర్ణయించుకుని దరఖాస్తు చేసుకోవాలి.
  • ఒక వేళ షేరు ధర అత్యధికంగా నమోదైతే లాటుకు రూ.14,345 వరకు అవ్వవచ్చు.
  • ఈ ఐపీఓకు 'లింక్​ లైన్​ టైమ్​ ఇండియా ప్రైవేట్​ లిమిటెడ్ రిజిస్టార్'​గా వ్యవహరిస్తుంది.

లక్ష్యం

  • ఈ ఐపీఓ ద్వారా మొత్తం 13 కోట్ల వాటాలను ఎస్​బీఐ విక్రయిస్తోంది.
  • ఈ ఐపీఓ ద్వారా దాదాపు రూ.10,000 కోట్లకు పైగా సమీకరించాలని సంస్థ లక్ష్యం.
  • ప్రస్తుతం దీనికి భారతీయ మార్కెట్​లో ఉన్న వాటా 18 శాతం

ఎస్​బీఐ... రిజర్వేషన్స్​

  • ఈ ఇష్యూలో మొత్తం 10 శాతం షేర్లను (1.3 కోట్ల వాటాలు) ఎస్​బీఐ షేర్​ హాల్డర్ల కోసం రిజర్వ్ చేశారు.
  • ఈ ఐపీఓకు దరఖాస్తు చేసుకోవాలంటే ఫిబ్రవరి 18 నాటికి ఎస్​బీఐ వాటాదారులు అయ్యుండాలి.
  • అర్హులైన ఉద్యోగుల కోసం 18.4 లక్షల షేర్లు కేటాయించారు
  • ఎస్​బీఐ ఉద్యోగికి ఒక్కో షేరుపై రూ.75 డిస్కౌంట్ ఉంటుంది.

ఇదీ చూడండి: ఈపీఎఫ్​ డిపాజిట్లపై వడ్డీ రేటు మళ్లీ 8.65 శాతమే!

Last Updated : Mar 3, 2020, 2:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.