దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ శాంసంగ్ సరికొత్త ఫోన్ సెన్సార్ ఫోన్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. అత్యంత శక్తివంతమైన ఇమేజ్ సెన్సార్ ను రూపొందిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసి ప్రత్యర్థి సంస్థలను ఆశ్చర్యంలో ముంచెత్తింది.
కన్ను కంటే పవర్ఫుల్
600 ఎంపీ రిజల్యూషన్‌తో మనిషి కంటి కంటే శక్తివంతమైన ఇమేజ్ సెన్సార్ ను రూపొందిస్తున్నట్లు శాంసంగ్ సెన్సార్ బిజినెస్ టీమ్ యాంగిన్ పార్క్ తెలిపారు. అలాగే వాసనలు, రుచులు తెలిపే ఇతర విభిన్న సెన్సార్లపైనా దృష్టి పెట్టినట్లు పేర్కొన్నాారు.
" ఇమేజ్ సెన్సార్లను అభివృద్ధి చేయడమే కాకుండా.. వాసనలు, రుచులు తెలిపే సెన్సార్ల తయారీపైనా దృష్టి పెట్టాం. మనిషి కళ్లనే మించిన సెన్సార్లను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాం. సాధారణంగా కనిపించనవి సైతం వీటి ద్వారా చూడవచ్చు. మన కళ్లకు మించి సామర్థ్యం ఉన్న వీటిని అందుబాటులోకి తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉంది."
-- యాంగిన్ పార్క్, శాంసంగ్ సెన్సార్ బిజినెస్ టీమ్ చీఫ్
జోరుమీదున్న శాంసంగ్
విభిన్న స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తీసుకురావడంలో శాంసంగ్ ఎప్పుడూ ముందుంటుంది. 2019 మే నెలలో శాంసంగ్ మొట్టమొదటి సారిగా 64 మెగా పిక్సెల్ కెమెరా ఫోన్‌ను లాంచ్ చేసింది. ఆరు నెలల తర్వాత 108 మెగా పిక్సెల్ కెమెరాను తీసుకొచ్చి మరోసారి షాకిచ్చింది. ఈ ఏడాది గెలాక్సీ ఎస్ 20 ఆల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇవే కాకుండా 0.7 మెగా పిక్సెల్ ఆధారిత ఇమేజ్ సెన్సార్లను ప్రవేశపెట్టిన మొదటి సంస్థ శాంసంగే కావడం గమనార్హం.
ఇదీ చదవండి: వాట్సాప్‌లో ఒకేసారి 8 మందితో వీడియో కాల్