ETV Bharat / business

'శాంసంగ్​' యూవీ స్టెరిలైజర్​తో 10 నిమిషాల్లో క్రిములు ఖతం!

author img

By

Published : Aug 2, 2020, 5:17 AM IST

Updated : Aug 2, 2020, 8:20 AM IST

కరోనాపై పోరులో భాగంగా పలు సంస్థలు కీలక ఆవిష్కరణలు చేస్తున్నాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ శాంసంగ్.. వైర్​లెస్​ ఛార్జింగ్​ సదుపాయంతో క్రిములను చంపే యూవీ స్టెరిలైజర్​ను తయారు చేసింది. గెలాక్సీ స్మార్ట్​ఫోన్లు, ఇయర్​బడ్స్​, స్మార్ట్​వాచ్​లపై ఉండే క్రిములను కేవలం 10 నిమిషాల్లో అంతం చేస్తుందని స్పష్టం చేసింది. మరి దాని వివరాలు తెలుసుకుందాం.

UV Sterilizer
యూవీ స్టెరిలైజర్​తో 10 నిమిషాల్లో క్రిములు ఖతం!

కరోనా భయంతో చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కొంటున్నాం సరే. పదే పదే ఉపయోగించే ఫోన్​, ఇయర్​బడ్స్ వంటి వాటి పరిస్థితి ఏమిటి? వాటిపై ఉండే క్రిములు, బాక్టీరియా వల్ల మనం అనారోగ్యం పాలయ్యే అవకాశం లేకపోలేదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నూతన యూవీ స్టెరిలైజర్​ను విడుదల చేసింది శాంసంగ్​. ఈవారంలోనే మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. వైర్​లెస్​ ఛార్జింగ్​ సదుపాయం ఉన్నట్లు తెలిపింది.

" యూవీ స్టెరిలైజర్​ ద్వారా గెలాక్సీ స్మార్ట్​ఫోన్లు, గెలాక్సీ ఇయర్​బడ్స్​, స్మార్ట్​ వాచ్​ వంటి వాటిపై ఉన్న క్రిములను అంతం చేయొచ్చు. మన వ్యక్తిగత రోజువారీ వస్తువులను క్రిమిరహితంగా, సురక్షితంగా ఉంచేందుకు సరైన, కాంపాక్ట్​ పరికరం ఇది. దీని​ ధర రూ. 3,599గా ఉంది."

-మోహన్​దీప్​ సింగ్, శాంసంగ్​ ఇండియా మొబైల్స్​ సీనియర్​ ఉపాధ్యక్షులు

10 నిమిషాల్లోనే..

యూవీ స్టెరిలైజర్​ ఒకే బటన్​తో ఉపయోగించగలిగే సులభ పరికరం. ఇందులో గెలాక్సీ స్మార్ట్​ఫోన్స్​, గెలాక్సీ ఇయర్​ బడ్స్​, స్మార్ట్​ వాచ్​ల వంటివి ఉంచినప్పుడు అది 10 నిమిషాల్లోనే క్రిములను చంపేసి... ఆటోమేటిక్​గా ఆగిపోతుంది. క్యూఐ- అనుకూల వైర్​లెస్​ ఛార్జింగ్​ ఉన్న ఏదైనా పరికరాన్ని ఛార్జ్​ చేయవచ్చు.

ఇదీ చూడండి: ఇక కరెన్సీ నోట్లు, ఫోన్​లకూ శానిటైజేషన్​

Last Updated : Aug 2, 2020, 8:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.