ETV Bharat / business

స్పెక్ట్రమ్‌ వేలంలో తొలిరోజు రూ. 77,146 కోట్ల బిడ్లు

author img

By

Published : Mar 1, 2021, 10:21 PM IST

Updated : Mar 2, 2021, 5:40 PM IST

దేశంలో స్పెక్ట్రం అమ్మకంపై సోమవారం నిర్వహించిన వేలంలో 77 వేల 146 కోట్ల రూపాయల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. ఈ ప్రక్రియ మంగళవారం కూడా కొనసాగనుంది.

దాదాపు ఐదేళ్ల తర్వాత దేశంలో తొలిసారి నిర్వహిస్తున్న భారీ టెలికాం స్పెక్ట్రమ్‌ వేలం ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజైన సోమవారం స్పెక్ట్రమ్‌ కొనుగోలుకు రూ. 77,146 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా బిడ్లు దాఖలు చేశాయి. మంగళవారమూ వేలం కొనసాగనుందని టెలికాం మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. మొత్తం ఏడు బ్యాండ్ల పరిధిలో 2,250 మెగాహెర్జ్‌ స్పెక్ట్రమ్‌ విక్రయానికి ఈ వేలం నిర్వహిస్తున్నారు. వీటి విలువ సుమారు రూ.4 లక్షల కోట్లుగా తెలుస్తోంది.

ఇందులో భాగంగా తొలి రోజు రూ. 77,146 కోట్లకు బిడ్లు దాఖలయ్యాయి. 800 మెగాహెర్జ్‌, 900 మెగాహెర్జ్‌, 1800 మెగాహెర్జ్‌, 2100 మెగాహెర్జ్‌, 2300 మెగాహెర్జ్‌ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్‌కు మాత్రమే టెలికాం కంపెనీలు బిడ్లు సమర్పించాయి.

700 మెగాహెర్జ్‌, 2,500 మెగాహెర్జ్‌ బ్యాండ్ల స్పెక్ట్రమ్‌ తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ వేలంలో ఒక్క 700 మెగాహెర్జ్‌ బ్యాండ్‌ పరిధిలోనే మూడో వంతు స్పెక్ట్రాన్ని ప్రభుత్వం విక్రయిస్తుండడం గమనార్హం. 2016లో కూడా ఈ బ్యాండ్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు. సరికొత్త సాంకేతికత, మౌలిక సదుపాయాలు, పరికరాలు అవసరం కావడంతో కొత్త బ్యాండ్‌ను కొనుగోలు చేయడానికి టెలికాం కంపెనీలు ముందుకు రావడం లేదని టెలికాం నిపుణులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: భారత్‌ 'పవర్​'‌పై డ్రాగన్‌ గురి!

Last Updated : Mar 2, 2021, 5:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.