ETV Bharat / business

'ఆ వార్తలు తప్పు- స్విస్​ బ్యాంకులో డిపాజిట్లు తగ్గాయ్'

స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు పెరిగాయని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. 2019 నుంచి ఈ డిపాజిట్లు సగానికి పడిపోయాయని తెలిపింది. అయితే ఇందుకు సంబంధించిన గణాంకాలను ఆర్థిక శాఖ వెల్లడించలేదు.

swiss bank deposits
స్విస్ బ్యాంక్ డిపాజిట్లు
author img

By

Published : Jun 19, 2021, 12:46 PM IST

స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 2019 నుంచి తగ్గుతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 2020లో ఈ డిపాజిట్లు 13 ఏళ్ల గరిష్ఠానికి చేరాయని వచ్చిన కథనాలకు ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంది. డిపాజిట్ల విలువలో మార్పులకు గల కారణాలపై స్విట్జర్లాండ్ అధికారుల నుంచి వివరణ కోరినట్లు తెలిపింది.

ఈ సందర్భంగా.. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్ల సంఖ్య సగానికి పడిపోయిందని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కానీ ఇందుకు సంబంధించిన గణాంకాలు వెల్లడించలేదు.

"నిజానికి 2019 చివరి నాటికి కస్టమర్ డిపాజిట్లు పడిపోయాయి. ట్రస్టీల ద్వారా దాచుకున్న నిధులు సగానికి పైగా తగ్గాయి. బాండ్లు, ఆర్థిక సాధనాల విభాగంలో అధిక పెరుగుదల నమోదైంది. నగదు తగ్గుదల, పెరుగుదలకు కారణాలు సహా తమ అభిప్రాయాలు చెప్పాలని స్విస్ అధికారులను కోరాం."

-కేంద్ర ఆర్థిక శాఖ

ఇటీవల స్విస్ జాతీయ బ్యాంక్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఆ దేశంలోని బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 13 ఏళ్ల గరిష్ఠానికి చేరాయి. 2019లో రూ.6,625 కోట్లుగా ఉన్న డిపాజిట్లు.. 2020 నాటికి రూ.20,706 కోట్లకు పెరిగాయి.

తమ దేశంలో భారతీయులు, ఎన్​ఆర్ఐలు దాచుకుంటున్న సొమ్ము గురించి వివరాలను భారత్​కు స్విట్జర్లాండ్ 2018 నుంచి ప్రతి ఏడాది వెల్లడిస్తోంది. 2018లో ఈ మేరకు భారత్-స్విస్ మధ్య ఒప్పందం కుదిరింది. అయితే అక్కడి బ్యాంకుల్లో భారతీయులు దాచుకుంటున్న నిధులన్నీ నల్లధనం కాదని కేంద్రం పేర్కొంది. మూడో దేశంలోని సంస్థల పేర్లతో దాచుకున్న డబ్బు ఇందులో ఉండదని తెలిపింది.

ఇదీ చదవండి: Corona Pandemic: దేశార్థికానికి కొవిడ్‌ శరాఘాతాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.